నాగ్ దర్శకుడి వెబ్ సిరీస్..!!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుం డిజిటల్ ట్రెండ్ నడుస్తోంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ డిజిటల్ మాధ్యమంలోకి అడుగు పెడుతున్నారు. ఇక నిర్మాతలు, నిర్మాణ సంస్థలు ముందుకొచ్చి డిజిటల్ కంటెంట్‌ను జనరేట్ చేయడానికి సిద్ధమవుతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. లేటెస్ట్ సమాచారం మేరకు దర్శకుడు ప్రవీణ్ సత్తారు.. ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ‘పీఎస్వీ గరుడవేగ’ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కలేదు. మధ్యలో రామ్‌తో తెరకెక్కాల్సిన చిత్రం చర్చల దశలోనే ఆగిపోయింది. ఆ సమయంలో ‘బాహుబలి’ చిత్రంలోని శివగామి పాత్రకు సంబంధించిన వెబ్ సిరీస్‌ను తెరకెక్కించడంలో బిజీగా మారిపోయారు.
ఆ పని పూర్తి కాగానే కింగ్ నాగార్జునతో ఓ సినిమా చేయడానికి స్క్రిప్ట్ ఓకే చేయించుకున్నారు. కానీ ఈ సినిమా ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టేలా ఉంది. అందుకు కారణం నాగార్జున వైల్డ్ డాగ్ సెట్స్‌పై ఉంది. బిగ్‌బాస్ సీజన్ 4 కూడా ప్రారంభం కానుంది. ఈ గ్యాప్‌లో ప్రవీణ్ సత్తారు ఓ వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధమవుతున్నారని టాక్. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఈ వెబ్ సిరీస్‌ను చేయడానికి సన్నద్ధం అవుతుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com