నాగ్‌, ధ‌నుష్ మ‌ల్టీస్టార‌ర్ ఆగిపోయిందా....

  • IndiaGlitz, [Thursday,December 27 2018]

కింగ్ నాగార్జున్‌, త‌మిళ విల‌క్ష‌ణ న‌టుడు ధ‌నుష్ కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ధ‌నుష్ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే కొంత భాగం చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌య్యింది. ఈ సినిమా ఆగిపోయింద‌ని కోలీవుడ్‌లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

అందుకు కార‌ణం నిర్మాణ సంస్థ తెన్నాండాల్ ఆర్ధికంగా న‌ష్ట‌పోవ‌డ‌మేన‌ట‌. ఈ సినిమా డిస్ట్రిబ్యూష‌న్ చేసిన మెర్స‌ల్‌, స‌ర్కార్ చిత్రాలు ఆర్దికంగా న‌ష్టాల‌నే మిగిల్చింద‌ట‌.

అందువ‌ల్ల చిత్ర నిర్మాణం చేయ‌లేక ఆపేయాల‌నుకుంటున్నార‌ని.. అందుక‌నే ధ‌నుష్ అసుర‌న్ సినిమాను ప్ర‌క‌టించుకున్నాడ‌నే వార్త‌లు జోరుగా విన‌ప‌డుతున్నాయి. మ‌రి దీనిపై ధ‌నుష్ .. నాగ్.. యూనిట్ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేస్తారో చూడాలి.