నాగ్, ధనుష్ మల్టీస్టారర్

  • IndiaGlitz, [Tuesday,January 16 2018]

టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని ప్ర‌స్తుతం రామ్ గోపాల్ వ‌ర్మ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ముగియగానే శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ మ‌ల్టీస్టార‌ర్ న‌టించ‌బోతున్నాడు. ఇందులో నాగార్జునతో నాని న‌టించ‌బోతున్నాడు. అంత‌కుముందుగానే నాగార్జున 'ఊపిరి' చిత్రంలో కలిసి న‌టించాడు. ఇప్పుడు మ‌రో త‌మిళ హీరోతో క‌లిసి న‌టిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఆ హీరో మ‌రెవ‌రో కాదు ధ‌నుష్‌. ఈ చిత్రాన్ని ధ‌నుష్ నిర్మిస్తాడ‌ట‌. ఈ విష‌య‌మై ధ‌నుష్ ఇటీవ‌ల హైద‌రాబాద్ వ‌చ్చి నాగ్‌ను క‌లిశాడ‌ని..నాగ్ కూడా పాజిటివ్‌గానే స్పందించాడ‌నేది టాక్‌.