నాగ్, ధనుష్ టైటిల్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు కింగ్ నాగార్జున ఇప్పుడు తమిళంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగార్జునతో కలిసి నటిస్తూనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు ధనుష్. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణిస్తున్న ధనుష్ ప్రస్తుతం ఈ సినిమాను తెరకెక్కించడంలో ఫుల్ బిజీగా ఉన్నారు.
లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రానికి నాన్ రుద్రన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఈ చిత్రంలో 15వ శతాబ్దానికి చెందిన పార్ట్ ఒకటి ఉంటుంది. అందులో నాగార్జున కనిపిస్తారట. అదితిరావు హైదరి, ఎస్.జె.సూర్య తదితరులు ఈ చిత్రంలో తారాగణంగా నటిస్తున్నారు.
చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత తమిళంలో నాగార్జున నటిస్తున్న చిత్రమిదే. ఈ చిత్రంతో పాటు బాలీవుడ్‌లో రూపొందుతున్న మల్టీస్టారర్ 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో కూడా నాగార్జున నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments