Nagarjuna :సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హీరో నాగార్జున దంపతులు
- IndiaGlitz, [Saturday,December 30 2023]
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy)సీనియర్ హీరో నాగార్జున(Nagarjuna), తన భార్య అమలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసిన నాగార్జున దంపతులు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అనేకమంది సినీ సెలబ్రిటీలు వ్యక్తిగతంగా కలిసి అభినందనలు చెబుతున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. త్వరలోనే పలువురు సినీ పెద్దలు సీఎంను కలిసి సినీ పరిశ్రమ గురించి చర్చించనున్నారు.
మరోవైపు ఇప్పటికే కొంతమంది సినీ ప్రముఖులు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నంది అవార్డులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ఏడాదిలో నంది అవార్డులను ఇస్తామని స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమను సత్కరిస్తే తమ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందన్నారు. వచ్చే ఉగాది నాటికి నంది అవార్డులను ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఈ అవార్డులను ఇస్తామని వ్యాఖ్యానించారు. చిన్నప్పటి నుంచి నంది అవార్డులు ఇవ్వడం తానూ చూశానని.. అవార్డులు ఇచ్చి గౌరవించుకోవటం అవసరమని కోమటిరెడ్డి చెప్పారు. త్వరలోనే దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి.. సినిమా పెద్దలను ఆహ్వానిస్తామని తెలిపారు.