'రారండోయ్ వేడుక చూద్దాం' విజయంతో చైతు అందరికీ ఇంకా దగ్గరవుతాడు - కింగ్ నాగార్జున

  • IndiaGlitz, [Tuesday,May 23 2017]

యువ సామ్రాట్‌ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించి చిత్రం 'రారండోయ్‌ ..వేడుక చూద్దాం'. ఈ సినిమా మే 26న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అక్కినేని నాగార్జున‌తో ఇంట‌ర్వ్యూ...
యూనిట్ అంతా సినిమాను త‌మ‌దిగా భావించారు...
'రారండోయ్ వేడుక చూద్దాం' నిర్మాత‌గా చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమాకు సంబంధించిన మొత్తం ప‌ది రోజుల ముందుగానే వ‌ర్కంతా పూర్త‌య్యింది. ఈ సినిమా అంతా టీం వ‌ర్క్ అని చెప్పాలి. జి.కె.మోహ‌న్‌, స‌త్యానంద్‌గారు, దేవిశ్రీ ప్ర‌సాద్ స‌హా అంద‌రూ ఈ సినిమాను త‌మ‌దిగా భావించారు. మాయ‌దారి మ‌ల్లిగాడు టైం నుండి స‌త్యానంద్‌గారు సినీ ఫీల్డ్‌లోనే ఉన్నారు. చాలా ఎక్స్‌పీరియెన్స్‌డ్ ప‌ర్స‌న్‌. స‌త్యానంద్ ప‌క్క నుంటే ఒక లైబ్ర‌రీ మ‌న ప‌క్క నున్న‌ట్లే. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా స‌మ‌యంలో కూడా స‌త్యానంద్‌గారు స‌పోర్ట్ అందించారు. దేవిశ్రీనైతే ఎడిటింగ్‌లో కూడా ఇన్‌వాల్వ్ చేయించాను. కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అందుకే వ‌స్తున్నాం. కాన్ఫిడెంట్ లేకుంటే ఏ ప‌ని చేయ‌కూడ‌ద‌నుకుంటాను. కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌.
రిలేష‌న్స్‌లో మార్పులొచ్చాయి..
నిన్నే పెళ్ళాడ‌తా నాకు చాలా ఇష్ట‌మైన సినిమా. అలాంటి ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉండాలి అనుకున్నాం. అయితే నిన్నే పెళ్ళాడ‌తా 1996లో వ‌చ్చిన సినిమా. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ రిలేష‌న్స్‌లో చాలా మార్పులు వ‌చ్చాయి. ఇప్ప‌డు రిలేష‌న్స్ ఎలా ఉన్నాయి. తండ్రికొడుకు, తండ్రి కూతురు మ‌ధ్య ఎలాంటి బాంధ‌వ్యాలున్నాయనే దానికి త‌గ్గ‌ట్టు సినిమాను రూపొందించాం.
నేను అలా భావించ‌ను..
ఏ న‌టుడికైనా ఓ ప‌ర్టికుల‌ర్ డైమెన్ష‌న్ ఉండాల‌ని అనుకోవ‌డం లేదు. ఎందుకంటే డైమ‌న్ష‌న్ ఉంటే దానికే క‌ట్టుబ‌డి ఉండిపోవాలి. చైతు డిఫ‌రెంట్ సినిమాలు చేస్తున్నాడు. ప్రేమ‌మ్ చేశాడు. ఇప్పుడు థ్రిల్ల‌ర్ మూవీ చేస్తున్నాడు. 'రారండోయ్ వేడుక చూద్దాం' విజ‌యంతో చైతు అంద‌రికీ ఇంకా ద‌గ్గ‌ర‌వుతాడు
ల‌వ‌బుల్ క్యారెక్ట‌ర్‌లో చైతు...
ఈ సినిమాలో చైత‌న్య కొత్త‌గా క‌న‌ప‌డ‌తాడు. చాలా ఓపెన్ అప్ అయిపోయి న‌టించాడు. ఎవ‌రికైనా ఇలాంటి ఫ్రెండ్‌, బాయ్‌ఫ్రెండ్, కొడుకు ఉండాల‌నుకునేంత ల‌వ‌బుల్ క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డ‌తాడు. జ‌గ‌ప‌తిబాబు, చైత‌న్య మ‌ధ్య సీన్స్ చాలా బ్యూటీఫుల్‌గా ఉంటాయి. ఆల్‌మోస్ట్ నిజ‌జీవితంలో నేను, చైత‌న్య ఎలా మాట్లాడుకుంటామో, అలా దింపేశాడు క‌ళ్యాణ్‌కృష్ణ‌.
ట్యాగ్ లైన్ పెట్ట‌డానికి కార‌ణం...
మ‌న్మ‌థుడు సినిమాలో కూడా హీ హేట్స్ ఉమెన్ అనే ట్యాగ్‌లైన్ పెట్టాం. సినిమా డిఫ‌రెంట్‌గా ర‌న్ అవుతుంది. అలాగే ఈ సినిమా కూడా అంతే. రారండోయ్‌లో ఓ లైన్ ఉంటుంది. రాకుమారుడు ఎవ‌రు..అంటే అమ్మాయిని రాణిలాగా చూసుకునేవాడే రాకుమారుడు అని. అమ్మాయిలు మ‌న‌శ్శాంతికి హానికరం అనేది కూడా మ‌న్మ‌థుడు స్ట‌యిల్‌లోని ట్యాగ్‌లైన్‌.
ఎవ‌రైనా ఖండించాల్సిందే..
ఆడియో వేడుక‌లో చ‌ల‌ప‌తిరావు అన్న‌ది త‌ప్పే, అంత పెద్ద సీనియ‌ర్ న‌టుడి గురించి నేను కామెంట్ చేయ‌కూడ‌దు. కానీ, అలాంటి వ్యాఖ్య‌లు చేస్తే ఎవ‌రినైనా, ఎవ‌రైనా ఖండించాల్సిందే.
స‌మంత ఎఫెక్ట్ ఏమో..
చైతు సినిమాల్లో చాలా ఈజప్ అయిపోయాడు. అది స‌మంత ఎఫెక్టో ఏమో(న‌వ్వుతూ..) కానీ, త‌నలో ఆ హ్యాపీనెస్ క‌న‌ప‌డుతుంది. 30 ఏళ్ళు వ‌స్తే కానీ మ‌గవారు ఫామ్‌లోకి రార‌ని వింటుంటాం క‌దా, ఇప్పుడు త‌న‌కి ముప్పై నిండింది క‌దా. స‌మంతతోమ‌నం సినిమా నుండి మంచి ప‌రిచ‌యం ఉంది. అప్పుడు సార్ అనేది ఇప్పుడు ఎలాగో ఒప్పించి మామా అని పిలిపిస్తున్నాను. మావ‌య్య అంటే మ‌రి ఓల్డ్‌గా ఉందని నేనే అన్నాను. యాక్టింగ్ ప‌రంగా డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్‌కృష్ణ‌ను ఫాలో అయిపొమ్మ‌ని నేను చెప్పాను.
ఇప్పుడే ప్రొడ‌క్ష‌న్ గురించి ఆలోచించొద్ద‌ని అన్నాను..
మా ఇద్ద‌ర‌బ్బాయిల‌తో ఇప్పుడే ప్రొడ‌క్ష‌న్ గురించి ఆలోచించొద్ద‌ని చెప్పాను. ఇప్పుడు యాక్టింగ్‌పైనే కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేయ‌మ‌ని చెప్పాను. అయితే అబ్జ‌ర్వ్ చేస్తుండ‌మ‌ని అన్నాను. అయితే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో ఇన్‌వాల్వ్ అవ‌మ‌ని చెప్పాను. ఒక న‌టుడిగా కాకుండా ఇత‌ర రంగాల్లో రాణించ‌డ‌మ‌నే క్వాలిటీ చైతు, అఖిల్ ఇద్ద‌రికీ ఉంది.
న‌చ్చిన సాంగ్స్‌...
సినిమా సాంగ్స్‌లో భ్ర‌మ‌రాంబ‌కు న‌చ్చేశానే సాంగ్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కానీ నాకు టైటిల్ ట్రాక్‌తో పాటు తకిట త‌కిట సాంగ్స్ బాగా న‌చ్చాయి. దేవి చాలా డేడికేష‌న్‌తో వ‌ర్క్ చేస్తాడు. త‌న వ‌ర్క్‌ను త‌ను ల‌వ్ చేస్తాడు అందుకే త‌ను పెద్ద మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయ్యాడు.
ర‌కుల్ డిఫ‌రెంట్‌గా క‌న‌ప‌డుతుంది...
ఇప్ప‌టి వ‌ర‌కు చూసిన ర‌కుల్ వేరు, ఈ సినిమాలో క‌న‌ప‌డే ర‌కుల్ వేరుగా ఉంటుంది. ఈ సినిమాలో ర‌కుల్ మేన‌రిజ‌మ్స్ చూస్తే శ్రీదేవిగారు, ట‌బు గుర్తుకు వ‌స్తారు. త‌ను పెర్‌ఫార్మెన్స్‌ను వ‌ర్కింగ్ టేబుల్‌పై చూసి నేను థ్రిల్ అయ్యాను. త‌న‌కు ఫోన్ చేసి ప్ర‌త్యేకంగా అభినందించాను.
బాహుబ‌లి టీం చేసింద‌దే...
బాహుబ‌లి-2 సినిమాకు ఇంత మంచి క‌లెక్ష‌న్స్‌, ఇంత మంచి పేరు వ‌స్తుందంటే కార‌ణం టీం మాత్ర‌మే. సినిమా ఈజ్ గాడ్ అనేది వాళ్ళు న‌మ్మి మ‌న‌కేం వ‌స్తుంద‌ని కాకుండా మంచి సినిమా తీయాల‌ని ప్ర‌య‌త్నించారు. మార్కెట్ స్పాన్ పెంచుకోవ‌డంలో ఇండియ‌న్ సినిమాను తెలుగు సినిమా స‌ర్‌ప్రైజ్ చేస్తూనే వ‌చ్చింది. మాయాబ‌జార్ విడుద‌లైన‌ప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వంద థియేట‌ర్స్ కూడా ఉండ‌వేమో. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల థియేట‌ర్స్ పైగా ఉన్నాయి. అప్ప‌ట్లో 35 థియేట‌ర్స్‌లో రిలీజైతే గొప్ప‌. అలాగే అడ‌విరాముడు వ‌చ్చింది. అదొక సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. బాలీవుడ్‌లో ఇలాంటి ఫినామిన‌ల్ క్రియేట్ అయ్యి నాలుగైదేళ్లు అయ్యింది. ఓవ‌ర్‌సీస్ మార్కెట్ ఓపెన్ అయ్యింది. మ‌న‌కు ఇప్పుడు అవుతుంది.
త‌దుప‌రి చిత్రాలు...
రాజుగారి గ‌ది2 సినిమా ప‌దిరోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. సినిమా అంతా ఒక‌సారి చూసి ఆ ప‌దిరోజుల చిత్రీక‌ర‌ణ‌ను ప్లాన్ చేస్తారు.- క‌ళ్యాణ్‌కృష్ణ‌తో నెక్స్‌ట్ సినిమా క‌థ‌పై కూర్చోవాలి. బంగార్రాజు చేయాలి. కానీ మంచి క‌థ కుద‌రితోనే చేయాలి.
అఖిల్ సినిమా గురించి...
అఖిల్ సినిమా యాక్ష‌న్ పార్ట్ పూర్త‌య్యింది. అఖిల్ సినిమా టైటిల్స్ కూడా నాలుగైదు ఆలోచ‌న‌లో ఉన్నాయి. మంచి తెలుగు టైటిలే పెడ‌తాం.
మ‌హాభార‌తంలో చేయ‌మ‌ని అడిగారు...
మ‌హాభార‌తంలో న‌న్ను క‌ర్ణుడి క్యారెక్ట‌ర్ చేయ‌మ‌ని అడిగారు. అయితే సినిమాను ఆన్ కార్డ్స్‌లో ఉంది. శ్రీకుమార్ నాలుగేళ్లుగా ఈ క‌థ‌పై వ‌ర్కువుట్ చేస్తున్నాడు. రెండేళ్ళ క్రిత‌మే వాసుదేవ‌నాయ‌ర్ క‌ర్ణుడు క్యారెక్ట‌ర్ చేయ‌మ‌ని అడిగారు. నాకు కూడా చేయాల‌ని ఆస‌క్తి ఉంది. మ‌రి చూడాలి..