మరో 30 ఏళ్లకు రెడీ అంటున్న నాగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
విక్రమ్ సినిమాతో తెలుగు తెర పై హీరోగా ఎంట్రీ ఇచ్చి..అనతి కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు కింగ్ నాగార్జున. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా కొత్తదనం కోసం తపించి... తెలుగు సినిమా నడతను మార్చి... నాగ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. నాగార్జున తొలి చిత్రం విక్రమ్ 1986 మే 23న రిలీజైంది. అంటే నేటికి సరిగ్గా విక్రమ్ రిలీజై 30 ఏళ్లు పూర్తయ్యింది. ఈ 30 సంవత్సరాల్లో నాగార్జున ఎన్నో సంచలన విజయాలు సాధించారు..మరెన్నో ప్రయోగాలు చేసారు. ఇప్పటి వరకు 95 చిత్రాల్లో నటించి సెంచరికీ అతి చేరువలో ఉన్నారు నాగార్జున.
విక్రమ్ నుంచి విక్రమాదిత్య (ఊపిరి) వరకు నాగార్జున తెలుగు తెర పై ఎన్నో ప్రయోగాలు చేసి సెల్యులాయిడ్ సైంటిస్ట్ అనిపించుకున్నారు. ఈ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా సోగ్గాడే చిన్నినాయనా చిత్రంతో సంచలన విజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో 53 కోట్లకు పైగా షేర్ సాధించి...50 కోట్ల క్లబ్ లో చేరిన తొలి సీనియర్ హీరోగా చరిత్ర సృష్టించారు. సోగ్గాడే చిన్నినాయనా చిత్రం తర్వాత నాగార్జున ఊపిరి చిత్రంతో రెండోసారి 50 కోట్లకు పైగా షేర్ సాధించడం విశేషం. మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన నాగార్జున ఇదే స్పీడు కొనసాగిస్తూ...దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో మరో అధ్యాత్మిక అధ్భుత చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు.
నటుడుగా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగ్ ట్విట్టర్ లో స్పందిస్తూ...30 ఏళ్లుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యాన్స్ నన్నుఎంతగానో ఆదరించారు. ఈ శుభ సందర్భంలో అమ్మ, నాన్నను బాగా మిస్ అవుతున్నాను. మరో 30 ఏళ్లు నటించేందుకు రెడీ అంటూ సంతోషంతో తన స్పందన పంచుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు అందిస్తూ నాటి నుంచి నేటి వరకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన నాగార్జున కంగ్రాట్స్ & ఆల్ ది బెస్ట్..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com