త‌క్కువ గ్యాప్‌లోనే వ‌స్తున్న నాగ్‌

  • IndiaGlitz, [Saturday,April 21 2018]

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు నాగార్జున గ‌త రెండేళ్ళుగా రెండు లేదా అంత‌కుమించిన చిత్రాల‌తో సంద‌డి చేస్తున్నారు. 2016లో ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన సోగ్గాడే చిన్ని నాయ‌నా, ఊపిరి చిత్రాలు విడుద‌ల కాగా.. అతిథి పాత్ర‌ల్లో న‌టించిన నిర్మలా కాన్వెంట్‌, ప్రేమ‌మ్ చిత్రాలు తెర‌పై సంద‌డి చేశాయి. ఇక‌ గ‌తేడాది అంటే 2017లో ఓం న‌మో వెంక‌టేశాయ‌, రాజు గారి గ‌ది2 చిత్రాలు రిలీజ‌య్యాయి. 

ఇదే జోష్‌ను ఈ ఏడాదిలోనూ కంటిన్యూ చేస్తున్నారు కింగ్‌. రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో దాదాపు 24 ఏళ్ళ త‌రువాత‌ ఆయన న‌టిస్తున్న ఆఫీస‌ర్ చిత్రం మే 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుద‌లైన మూడు నెల‌ల్లోనే మ‌రో సినిమాతో సంద‌డి చేసేందుకు నాగ్‌ సిద్ధ‌మ‌వుతున్నారు. ఆ చిత్ర‌మే నేచుర‌ల్ స్టార్ నానితో చేస్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ. సి.అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా ఆగ‌స్టులో సంద‌డి చేయ‌నుంది. మొత్తానికి.. త‌క్కువ గ్యాప్‌లోనే నాగ్ నుంచి రెండు సినిమాలు రానున్నాయ‌న్న‌మాట‌.

More News

టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా' కొత్త చిత్రం ప్రారంభం

Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో

'మేళా' టీజ‌ర్ విడుద‌ల‌

మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో కొంకా ప్రొడక్షన్స్‌, పి.ఎస్‌.పి.ఫిలింస్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మేళా'.

షూటింగ్ పూర్తి చేసుకున్న కోటేంద్ర 'బంగారి బాలరాజు'

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా

ఏప్రిల్ 27న 'క‌ణం'

'ఫిదా' తో తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసి 'ఎం.సి.ఏ' తో ఆకట్టుకున్న సాయి పల్లవి ఇప్పుడు మరో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన 'కణం'

అప్పుడు 'పోకిరి'..ఇప్పుడు 'భరత్ అనే నేను'

“మాట ఇస్తే.. ఎంత కష్టమైనా వెనక్కి తీసుకోకూడదు.. ఆ మాట గాలిలో ఉండాలి తప్పా..