గ‌ట్టి పోటీ మ‌ధ్య వ‌స్తున్న నాగ్‌...!

  • IndiaGlitz, [Tuesday,February 16 2021]

కింగ్ నాగార్జున టైటిల్ పాత్ర‌లోన‌టిస్తోన్న చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. సాల్మ‌న్ అహిషోర్ డైరెక్ట‌ర్‌గా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిన ఈ చిత్రం గ‌త ఏడాదిలోనే విడుదల కావాల్సింది. అయితే కోవిడ్ ప్ర‌భావంతో సినిమా విడుద‌ల వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. చిత్రీక‌ర‌ణంతా పూర్త‌యిన త‌ర్వాత సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని కూడా అనుకున్నారు. అయితే ఈలోపు థియేట‌ర్స్ ఓపెన్ అయ్యాయి. ఏప్రిల్ 2న ఈ సినిమా థియేట‌ర్స్‌లో విడుద‌లవుతుంది. అయితే కోవిడ్ ప‌రిస్థితుల్లో నాగార్జున గ‌ట్టి పోటీని ఫేస్ చేయాల్సి వ‌స్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇప్ప‌టికే ఏప్రిల్ 2న గోపీచంద్ సీటీమార్ చిత్రంతో పాటు కార్తి హీరోగా న‌టించిన సుల్తాన్ కూడా విడుద‌ల‌వుతుంది. మ‌రి ఈ పోటీలో నాగ్ స‌క్సెస్ అవుతాడో లేదో మ‌రి.

ఇక వైల్డ్ డాగ్ విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమాలో నాగార్జున విన‌య్ వ‌ర్మ అనే ఎన్ఐఏ ఆఫీస‌ర్ పాత్ర‌లో కనిపిస్తాడు. ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ అయిన విన‌య్ వ‌ర్మ చాలా రఫ్ అండ్ ట‌ఫ్ కావ‌డంతో అంద‌రూ ఆయ‌న్ని వైల్డ్ డాగ్ అంటుంటారు. ప‌క్కా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో దియా మీర్జా హీరోయిన్‌గా న‌టిస్తుంది. స‌యామీ ఖేర్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది.