BiggBoss: నాగ్ క్లాస్ బాగానే పనిచేసినట్లుంది.. నామినేషన్స్‌లో రోత రోత
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టింది. హౌస్ నుంచి ఒకేసారి ఇద్దరు ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులు షాక్ అయ్యారు. అలాగే తిని కూర్చుంటే కాదని, గేమ్ సరిగా ఆడకపోతే.... ఇంటిలో వుండటానికి వీల్లేదని నాగార్జున గట్టిగా చెప్పిన ఎఫెక్ట్ కూడా హౌస్‌మెట్స్‌పై బలంగా పడినట్లుగా కనిపిస్తోంది. సోమవారం కావడంతో నామినేషన్స్ జరిగాయి. గత రెండు ఎపిసోడ్స్‌లో యాక్టీవ్‌గా లేనివాళ్లు కూడా ఈరోజు రెచ్చిపోయారు. కానీ గేమ్ ఆడకుండా డల్‌గా కూర్చోవద్దని చెప్పినా సత్య తీరులో మార్పు రాలేదు. తాను డబ్బు కోసమే బిగ్‌బాస్‌కి వచ్చినట్లు తెలిపింది.
ఇక నామినేషన్ల విషయానికి వస్తే.. ఇష్టం లేని ఇద్దరు కంటెస్టెంట్స్ ముఖంపై పెయింట్ రాసి నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించారు. దీంతో శ్రీసత్య.... ఆరోహి, ఇనయాలను, గీతూ... సుదీప, చంటీలను, చంటీ... గీతూ, రేవంత్‌లను, ఇనయా.... గీతూ, రేవంత్‌లను, ఆదిరెడ్డి... ఇనయా, వాసంతిలను, సుదీప.... గీతూ, శ్రీహాన్‌లను, బాలాదిత్య.... ఆరోహి, రేవంత్‌లను, వాసంతి... ఆదిరెడ్డి, నేహాలను, మెరీనా... రేవంత్, ఫైమాలను, ఆర్జే సూర్య.... రేవంత్, బాలాదిత్యలను, కీర్తి... ఆరోహి, చంటిలను, నేహా చౌదరి... వాసంతి, గీతూ, అర్జున్... ఆరోహి, శ్రీహాన్‌లను, ఫైమా... రోహిత్, బాలాదిత్యలను, శ్రీహాన్... ఇనయా, అర్జున్‌లను, ఆరోహి... శ్రీసత్య, బాలాదిత్యలను, రాజ్‌శేఖర్... ఆరోహి, బాలాదిత్యలను నామినేట్ చేశారు. వీరందరిలో అత్యధికంగా ఓట్లు పడ్డ రేవంత్, బాలాదిత్య, గీతూ, ఆరోహి, చంటి, వాసంతి, నేహా, శ్రీహాన్, ఇనయా, సుదీపలు నామినేషన్స్‌లో వున్నారు.
నామినేషన్ సందర్భంగా గీతూ.. ఇనయాల మధ్య జరిగిన గొడవ హైలైట్‌గా నిలిచింది. గీతూ ఫెయిర్‌గా ఆడటం లేదని ఆమెను నామినేట్ చేసింది ఇనయా. కెప్టెన్సీ టాస్క్ సమయంలో నామినేషన్స్‌లో వున్నాడనే కారణంతో రాజ్‌కి ఛాన్స్ ఇచ్చిందని అది తనకు నచ్చలేదని రీజన్ చెప్పింది. ఒకే ఇంట్లో వుంటున్నప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదని ఇనయా మండిపడింది. దీనికి గీతూ కౌంటరిస్తూ... తాను హౌస్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి ఫెయిర్‌గానే ఆడుతున్నాని చెప్పింది. అప్పుడు రాజ్ గెలవడం నాకు ముఖ్యమని తెలిపింది. అవును నీకు రాజ్ బాగా నచ్చాడు కదా.. అందుకే ఇలా అంటూ ఇనయా కామెంట్ చేసింది. అవునే నచ్చాడనే ఇచ్చా .. ఇప్పటికే ఎక్కువ చేశావ్, ఇక ఆపు ఇక్కడి నుంచి దొబ్బేయ్ అంటూ గీతూ విశ్వరూపం చూపించింది. నేను గేమ్‌లో వుంటే నేనే గెలవాలని అనుకుంటా.. లేదంటే నా ఫ్రెండ్ గెలవాలని అనుకుంటానని క్లారిటీ ఇచ్చింది.
అటు చలాకీ చంటి కూడా గీతూని నామినేట్ చేసి.. పది మందిలో వున్నప్పుడు సంస్కారంతో వుండాలని చెప్పాడు. దీనిపై మండిపడ్డ గీతూ.. ముందు నీకు సంస్కారం వుందో లేదో చూసుకోండి అంటూ ఫైరైంది. అందరితో గొడవ పెట్టుకోవడం గేమ్ ఆడటం కాదని చంటి హితబోధ చేసే ప్రయత్నం చేశాడు. దీనికి గీతూ స్పందిస్తూ.. నాకు అందరితో గొడవ పెట్టుకోవడానికి తీట లేదు అని కామెంట్ చేసింది.
మొత్తం మీద బిగ్‌బాస్ చప్పగా సాగుతుందంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో నాగ్ పీకిన క్లాస్.. ఇంట్లో ప్రభావం చూపుతున్నట్లుగానే వుంది. కంటెస్టెంట్స్‌లో కసి రగిలి.. అది ఈ వారం నామినేషన్స్‌లో కనిపించింది. 6వ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఈరోజే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చోటు చేసుకుంది. మరి ఈ కసి వారం మొత్తం కొనసాగుతుందో.. లేదంటే చప్పబడిపోతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments