Bigg Boss Telugu 7 : హౌస్‌లో బంగారం ఎవరు.. మట్టి ఎవరు, గౌతమ్ పసలేని వాదన.. శివాజీని మళ్లీ పొగిడిన నాగార్జున
Send us your feedback to audioarticles@vaarta.com
అమర్‌దీప్ పోరాటంతో శోభాశెట్టి హౌస్‌కి కొత్త కెప్టెన్‌గా నిలిచింది. అంతేకాదు.. బిగ్‌బాస్ సీజన్ 7లో కెప్టెన్ అయిన తొలి ఫిమేల్ కంటెస్టెంట్‌గా నిలిచింది. శనివారం కావడంతో ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఈ వారం కంటెస్టెంట్స్ చేసిన తప్పులు, వారి పర్ఫార్మెన్స్‌పై రివ్యూ ఇచ్చాడు. కోలీవుడ్ స్టార్ కార్తీ నటించిన ‘‘జపాన్’’ చిత్రం దీపావళి సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీమ్.. బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేసింది. అనంతరం కంటెస్టెంట్స్ రివ్యూ మొదలుపెట్టారు.
కెప్టెన్సీ టాస్క్‌లో శివాజీ తనను కావాలనే పక్కనపెట్టాలని ప్రయత్నించాడని గౌతమ్ కంప్లయింట్ చేశాడు. దీనిపై నాగ్ స్పందిస్తూ.. ఇది నువ్వు చూశావా లేదా ఎవరైనా చెప్పారా అని ప్రశ్నించాడు. ఇంతలో గౌతమ్‌కి అశ్విని మద్ధతు దొరికింది. గౌతమ్‌కు శివాజీ అన్యాయం చేశాడని భావించేవారు చేతులు ఎత్తాలని నాగ్ అడిగాడు. దీంతో అశ్వినీ మాత్రమే చెయ్యెత్తింది. అయితే తాము అశ్వినీకి చెప్పామని.. మీ ముందు ఇలా మాట్లాడుతోందని అమర్ అన్నాడు. దీనికి నాగ్ స్పందిస్తూ.. శివాజీ ఒక్కొక్కరిని పక్కకు పిలిచి మాట్లాడారా అని ప్రశ్నించాడు. దీనికి అశ్వినీ ఆన్సర్ ఇస్తూ.. లేదు సార్ గ్రూప్ గానే పిలిచి మాట్లాడారని చెప్పింది. దీంతో విషయం అర్ధమైన నాగార్జున ఆమె చెప్పుడు మాటలకు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యిందని తేల్చేశారు.
కాగా.. మరోసారి శివాజీపై నాగార్జున అంతులేని ప్రేమ చూపించారు. బాల్స్ గేమ్‌లో .. సేకరించిన బాల్స్‌ను కాపాడుకోవాలని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే గౌతమ్ టీమ్‌లోని సభ్యులు శివాజీ గ్రూపులోని సభ్యుల బాల్స్ దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. దీనిని గమనించిన శివాజీ.. తన సంచి జోలికి వస్తే తొక్క తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇదే విషయాన్ని నాగ్ వద్ద కంటెస్టెంట్స్ ప్రస్తావించగా.. దొంగతనాన్ని ఆపడమనేది శివాజీ స్ట్రాటజీ అని కవర్ చేశాడు. అనుకోకుండా ఛాన్స్ రావడంతో అవును.. అది నా స్ట్రాటజీ అని శివాజీ చెప్పుకొచ్చాడు. అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం ఎవరు ఎలా ఆడారు అనే దానిపై కంటెస్టెంట్స్ ఫోటోలను బంగారం, మట్టి, బొగ్గు టేబుల్‌తో అతికించాడు నాగార్జున. గౌతమ్, శోభా శెట్టి, తేజ, అమర్, అర్జున్, శివాజీలను బంగారం లైన్‌లో పెట్టాడు. భోలే షావళి, రతిక, అశ్వినీలను బొగ్గు కేటగిరీలో వుంచాడు. ప్రిన్స్ యావర్, ప్రియాంక ఫోటోలను మట్టిలో పెట్టాడు.
ఇకపోతే .. ఈ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ కాబోతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈవారం అతనితో పాటు శోభాశెట్టి, ప్రియాంక, ప్రిన్స్ యావర్, అశ్వినీ శ్రీ, రతిక, భోలే, అర్జున్‌లు నామినేషన్స్‌లో వున్నారు. వీరిలో శోభాశెట్టి కెప్టెన్ కావడంతో బతికిపోయింది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో.. ఎవరు సేవ్ అవుతారో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments