రాజ్‌త‌రుణ్‌ని న‌మ్మిన నాగార్జున‌

  • IndiaGlitz, [Friday,November 17 2017]

టాలీవుడ్‌లో తక్కువ టైంలోనే మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో రాజ్ తరుణ్. అలాగే తనకంటూ అభిమానులను కూడా సంపాదించుకున్నాడు ఈ యువ క‌థానాయ‌కుడు. కాగా, రాజ్ త‌రుణ్ నటించిన 'రాజుగాడు', 'రంగుల రాట్నం' చిత్రాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఈ హీరోని 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసింది కింగ్ నాగార్జున. ఇప్పుడు సంక్రాంతికి విడుదల కానున్న రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ 'రంగుల రాట్నం'కి కూడా నాగార్జున నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

కేవలం హీరో మీద, అలాగే ఈ సబ్జెక్టు మీద ఉన్న నమ్మకంతో అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ మూవీని దాదాపు రూ.5 కోట్ల బ‌డ్జెట్‌తో తెరకెక్కించార‌ని తెలిసింది. ఒక‌విధంగా చెప్పాలంటే.. రాజ్ తరుణ్ కెరీర్లోనే ఇది అత్యంత భారీ సినిమా. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ మూడు సార్లు పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి వస్తుంది. అది ఎందుకు? అని తెలియాలంటే జనవరి 13 వరకు వేచి ఉండాల్సిందే.

More News

డబుల్ బొనాంజా ఇవ్వబోతున్న నాగశౌర్య

'జ్యో అచ్యుతానంద' త‌రువాత ఏడాది గ్యాప్‌తో యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య సంద‌డి చేసిన చిత్రం 'కథలో రాజకుమారి'. నారా రోహిత్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో నాగ‌శౌర్య గెస్ట్ రోల్ చేశాడు.

సుమంత్ సినిమాకి మంచి ప్రీ-రిలీజ్ మార్కెట్

చాలా కాలం నుంచి హిట్ కోసం పరితపిస్తున్నకథానాయకుడు సుమంత్. ఈ మధ్య కాలంలో మంచి డీసెంట్ ఫిలిమ్స్ చేసినా.. అవన్నీ సుమంత్ కి హిట్ ని అందించలేకపోయాయి. అయితే ప్రస్తుతం సుమంత్ కి ఆనందాన్నిచ్చే విషయం ఒకటి ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న హెచ్ బి డి చిత్రం

లాగిన్ మీడియా బ్యానర్లో మేఘన, సంతోషి శర్మ, సల్మాన్, హిమాజ, మానస, అజయ్ తదితరులు నటిస్తున్న హెచ్ బి డి( హ్యాకెడ్ బై డెవిల్) చిత్రానికి దర్శకుడు కృష్ణ కార్తిక్ కాగా నిర్మాత వై. ఉదయ్ కుమార్ గౌడ్.

అనుష్క భాగమతి రిలీజ్ డేట్

టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క నటించిన తాజా తెలుగు చిత్రం భాగమతి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటించిన తీరు అందర్నీ అబ్బురపరిచింది.

'అమ్మాయిలంతే..అదో టైపు' ట్రైలర్ ఆవిష్కరించిన శ్రీకాంత్ అడ్డాల

ఇటీవలి కాలంలో బంధాలు అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ కోవలోనే ఆకట్టుకోబుతున్న మరో ఆసక్తికరచిత్రమిది. తండ్రి -తనయల అనుబంధం నేపథ్యంలో ఉద్వేగభరితమైన కంటెంట్ తో తీస్తున్న చిత్రమిది.