ఐదున్నర నెలల తర్వాత మళ్లీ వర్క్ చేయబోతున్నా: నాగార్జున
Send us your feedback to audioarticles@vaarta.com
తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అక్కినేని నాగార్జున గుడ్ న్యూస్ చెప్పారు. ఐదున్నర నెలల తర్వాత మళ్ళీ వర్క్ చేయబోతున్నానని నాగ్ తెలిపారు. అయితే సినిమా షూటింగ్ కాదులెండి.. ‘బిగ్‌బాస్ షో’. ఈ షో సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. సీజన్ 4కి కూడా నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఈ సీజన్‌ను కూడా సక్సెస్ చేయాలని నాగ్ కోరారు.
‘‘హాయ్.. అందరికీ నమస్కారం! ఇవాళ నా 31వ పుట్టినరోజు (నవ్వుతూ) నిన్నటి నుంచి ఎంతో మంది ప్రేమ, అభిమానంతో తమ విషెస్ ను మెసేజెస్‌ను నాకు పంపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అక్కినేని అభిమానులకు, పరిశ్రమలో నా స్నేహితులకు, అందరికీ థాంక్స్. ఇంకో విషయం గురించి కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అయిదున్నర నెలల తర్వాత మళ్ళీ వర్క్ చేయబోతున్నాను.. బిగ్ బాస్ సీజన్ 4 షూటింగ్ కి వెళ్ళబోతున్నాను.
లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 3తో మీ ముందుకొచ్చాను. మీరందరూ నా మీద ఎంతో ప్రేమ, అభిమానం చూపించారు. ఆ సీజన్ ను ఎంతో సక్సెస్ చేశారు. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ సీజన్ 4ను కూడా మీ ప్రేమ, అభిమానం, మీ బ్లెస్సింగ్స్, పార్టిసిపేషన్‌తో ఎంతో సక్సెస్ చేయాలని నా కోరిక. నా కోరిక తీరుస్తారు కదూ.. మీ అందరినీ బిగ్ బాస్ సీజన్ 4లో కలుసుకోవడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను’’ అని నాగార్జున ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com