తాత‌య్య‌గా నాగార్జున‌...

  • IndiaGlitz, [Monday,July 09 2018]

అదేంటి నాగార్జున తాత‌య్య అయ్యాడా? అని అనుకునేరు.. ఫోటోలో క‌న‌ప‌డుతున్న‌ది గెట‌ప్ మాత్ర‌మే. వివ‌రాల్లోకెళ్తే.. తాత గెట‌ప్‌లో నాగార్జున ఓ పాప‌తో తీసుకున్న ఫోటో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇది దేవ‌దాస్‌లో నాగ్ గెట‌ప్ అని కూడా వార్త‌లు వినిపించాయి.

అయితే స‌మాచారం ప్ర‌కారం తాత‌య్య గెట‌ప్‌లోని నాగ్ లుక్ దేవ‌దాస్ సినిమాలోనిది కాద‌ట‌.. ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ కోసం నాగార్జున వేసుకున్న గెట‌ప్ అని తెలుస్తుంది. ఫిట్‌నెస్‌, లుక్ విష‌యంలో కుర్ర హీరోల‌తో పోటీ ప‌డే నాగార్జున తాత‌య్య గెట‌ప్‌లో బాగానే ఉన్నారు మ‌రి. నిజంగా తాత‌య్య ఎప్పుడ‌వుతారో..!