అఖిల్ ను పాఠాలు నేర్చుకోమన్న నాగ్...
- IndiaGlitz, [Tuesday,June 14 2016]
అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్..వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా విడుదలకు ముందు సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే విడుదల తర్వాత అంతా తారమారైంది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది. ఈ సినిమా విడుదలకు ముందు రెండు, మూడు సినిమాలకు ప్లాన్ చేసుకున్న అఖిల్ వెంటనే ఆ ఆలోచనను వెనక్కి తీసుకున్నాడు.
ఇంకా ఇప్పటి వరకు తన రెండో సినిమాపై క్లారిటీ కూడా ఇవ్వలేకపోతున్నారు. అయితే నాగార్జున ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా అభిమానులకు ఓ విషయాన్ని చెప్పాడు. చిరంజీవి సినిమా జర్నీ చాలా గొప్పదని, ఎంతో మందికి ఇన్ స్పిరేషన్ గా నిలిచిందని అన్న నాగ్..అవార్డ్ ఫంక్షన్ కు అఖిల్ రాలేకపోయాడని వస్తే బావుండేది..చిరంజీవిగారి దగ్గర పాఠాలు నేర్చుకోమని చెప్పేవాడినంటూ చెప్పాడు. ఇలా మనసలో ఉన్నదున్నట్లు చెప్పడం నాగార్జునకే చెల్లింది.