ఓం నమో వేంకటేశాయ నాగ్ మరో లుక్ రిలీజ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్నభక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అందాల తారలు అనుష్క, ప్రగ్యా జైస్వాల్, విమలారామన్ నటిస్తున్నారు. హథీరామ్ బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్నఓం నమో వేంకటేశాయ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ మూవీలోని నాగార్జున మరో లుక్ ను ఈరోజు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు. డిఫరెంట్ గా ఉన్న ఈ లుక్ లో రౌద్రంగా కనిపిస్తున్న నాగ్ ను చూస్తుంటే మూవీని ఎప్పుడు చూస్తామా అని ఆసక్తిని కలిగిస్తుంది.ఇక ఓం నమో వేంకటేశాయ టీజర్ ను ఈనెల 24న రిలీజ్ చేయనున్నట్టు తెలియచేసారు. ఈ చిత్రానికి స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ భక్తిరస చిత్రాన్ని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments