నాగార్జున మ‌రో భ‌క్తిర‌స చిత్రం..!

  • IndiaGlitz, [Thursday,January 12 2017]

అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడి సాయి చిత్రాల త‌ర్వాత న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున న‌టించిన మ‌రో భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించారు. మ‌హేష్ రెడ్డి నిర్మించిన ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రం ఫిబ్ర‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే....ఓం న‌మో వేంక‌టేశాయ ఆడియో వేడుక‌లో నాగార్జున మాట్లాడుతూ...ర‌చ‌యిత జె.కె.భార‌వి మ‌రో క‌థ రెడీ చేస్తున్నారు. కాక‌పోతే అది భ‌క్తిర‌స చిత్రం కాదు అని చెప్పారు. అయితే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే...ఇస్కాన్ (అంత‌ర్జాతీయ కృష్ణ చైత‌న్య సంఘం) ఫౌండ‌ర్ అయిన స్వామి ప్ర‌భుపాద జీవితం ఆధారంగా భార‌వి క‌థ రెడీ చేస్తున్నార‌ట‌. శ్రీకృష్ణుడి భ‌క్తుడి జీవిత క‌థ కాబ‌ట్టి ఈ చిత్రాన్ని ఇస్కాన్ పౌండేష‌న్ నిర్మించ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపిస్తుంద‌ట‌.మ‌రి... నాగ్ ఈ మూవీ చేస్తే మ‌రో సంచ‌ల‌న‌మే..!

More News

బాల‌య్య శాత‌క‌ర్ణి గురించి మెగాహీరో ట్వీట్..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. అటు అభిమానులు, ఇటు ఇండ‌స్ట్రీ నుంచి సినీ ప్ర‌ముఖులు బాల‌య్య గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం అద్భుతంగా ఉంది

ఓవ‌ర్ సీస్ లో ఖైదీ నెం 150 సంచ‌ల‌నం..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఖైదీ నెం 150 చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో కూడా సంచ‌ల‌నం సృష్టిస్తుంది.

ఈరోజు మధ్యాహ్నం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ని వీక్షించనున్న కె.సి.ఆర్

తెలుగుజాతి ఖ్యాతిని చాటి చెప్పిన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి జీవితగాథ బాలకృష్ణ హీరోగా తెరకెక్కింన సంగతి తెలిసిందే.

'గౌతమిపుత్ర శాతకర్ణి' ని అభినందించిన దర్శకధీరుడు....

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన బాలయ్య 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'.

బాలయ్య శాతకర్ణికి గురించి బన్ని, ఎన్టీఆర్ ట్వీట్స్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.