నాగ్.. మరో బాలీవుడ్ సినిమా
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడు. బాలీవుడ్‌లో నటించడం నాగార్జునకు కొత్త కాదు. 'శివ', 'ఖుదాగవా', 'క్రిమినల్', 'ఎల్‌వోసీ కార్గిల్' చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. 2003లో 'ఎల్.ఒ.సి కార్గిల్' తర్వాత మరో బాలీవుడ్ సినిమా చేయలేదు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటించడానికి ఓకే చెప్పారట నాగ్.
రణభీర్ కపూర్, అలియా భట్ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి కీలక పాత్రలో నటిస్తున్నారట. ఇప్పుడు నాగార్జున కూడా జాయన్ అయ్యారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షెడ్యూల్ ముంబైలో ప్రారంభం కానుందట. అందులో నాగార్జున పాల్గొనబోతున్నారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com