త‌న మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేసిన నాగార్జున‌

  • IndiaGlitz, [Thursday,June 23 2016]

అక్కినేని నాగార్జున, ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్రరావు కాంబినేష‌న్‌లోమ‌రో భ‌క్తిర‌స చిత్రం రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఈ జూన్ 25 నుండి సినిమా సెట్స్‌కు వెళ్ల‌నుంది. వెంక‌టేశ్వ‌రుని కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. గ‌తంలో అన్న‌మ‌య్య‌, రామ‌దాసు వంటి భ‌క్తులను తెలుగు ప్రేక్ష‌కులకు త‌న‌దైన శైళిలో ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు రాఘవేంద్ర‌రావు మ‌రో వెంక‌టేశ్వ‌రుని భ‌క్తుడు హ‌థీ రాంబాబా. ఆశారాం జీవితాన్ని సినిమాగా తీయ‌నున్నాడు.

త‌న భ‌క్తుడిని కాపాడ‌టానికి ఏనుగు రూపంలో వ‌చ్చి వేంక‌టేశ్వ‌రుడు కాపాడాడ‌ని చ‌రిత్ర చెబుతుంది. ఈ సినిమా టైటిల్ ఎప్పుడో అన‌ధికారంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఇప్పుడు అధికార‌క‌మైంది. ఈరోజు ఉద‌యం అక్కినేని నాగ‌ర్జున‌, కె.రాఘ‌వేంద్ర‌రావు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. త‌మ కాంబినేష‌న్‌లో రానున్న కొత్త మూవీకి ఓం న‌మో వెంక‌టేశాయ అనే టైటిల్‌ను ప్ర‌క‌టించారు.

More News

'బాహుబ‌లి2'కి నాని డైరెక్ష‌న్‌..

రీసెంట్‌గా విడుద‌లైన ‘జెంటిల్‌మ‌న్’ చిత్రంతో మ‌రో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్న హీరో నాని ఇప్పుడు విరించివ‌ర్మ, జెమిని  కిర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రంలో న‌టిస్తున్నాడు.

హిట్ ద‌ర్శ‌కుడితో నిఖిల్‌

హ్య‌పీడేస్‌తో తెరంగేట్రం చేసిన హీరో నిఖిల్ త‌ర్వాత యువ‌త చిత్రంతో కూడా మంచి స‌క్ససే అందుకున్నాడు. అయితే త‌ర్వాత అన్నీ ప్లాప్ చిత్రాల్లో భాగ‌మ‌య్యాడు.

ఉంటే చాలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ అవ‌స‌రం లేదు - హీరో నాని

నేచుర‌ల్ స్టార్ నాని, ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం జెంటిల్ మ‌న్. ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న నివేధ థామ‌స్, సుర‌భి న‌టించారు. శ్రీదేవి మూవీస్ పై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

దిల్ రాజు ఆ ద‌ర్శ‌కుడితో సినిమా లేన‌ట్లే...?

మెగాబ్ర‌ద‌ర్ త‌న‌యుడు వ‌రుణ్ తేజ్, హీరోగా విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ముకుంద‌, కంచె, లోఫ‌ర్ వంటి డిఫ‌రెంట్ మూవీస్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు.

విజ‌య్ విల‌నే ప్ర‌భాస్ విల‌న్ అయ్యాడు...?

ప్రస్తుతం బాహుబలి2 చిత్రీకరణలో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  ఈ సినిమా తర్వాత రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని స‌మాచారం.