3, 4 సీజన్లకే హైలైట్.. ఒక్కొక్కరినీ నిలబెట్టి కడిగేసిన నాగ్.. కల్యాణి ఎలిమినేషన్..
Send us your feedback to audioarticles@vaarta.com
వీకెండ్ షోను హోస్ట్ నాగార్జున హౌస్‌ను షేక్ ఆడించారు. ఈ రేంజ్‌లో నాగ్ ఫైర్ అవడం సీజన్ 3, 4 లలో ఇదే తొలిసారి కావచ్చేమో. సెల్ఫ్ నామినేట్ అయిన వాళ్లందరినీ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ కడిగి పారేశారు. నేడు షో స్టార్టింగ్‌లోనే నాగ్ షాక్ ఇచ్చారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని వెల్లడించారు. నిన్న ఏం జరిగిందో నాగ్ చూశారు. అనంతరం నాగ్.. గంగవ్వను కన్ఫెషన్ రూమ్‌కి పిలిపించి మాట్లాడారు. తాను ఎంజాయ్‌గా ఉంటా అని గంగవ్వ నాగ్‌కు తెలిపారు. గంగవ్వను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని నాగ్ హామీ ఇచ్చారు. కంటెస్టెంట్ల ముందుకు వచ్చీ రాగానే.. నాగ్ క్లాస్ స్టార్ట్ చేశారు. ఆ క్లాస్ మామూలుగా లేదు. కుమార్ సాయి నవ్వుతుంటే.. హౌస్‌లోకి వెళ్లి ఏమాత్రం ఎంటర్‌టైన్ చేయట్లేదని వాయించేశారు. ఆ తరువాత కంటెస్టెంట్లందరినీ ఎందుకు నామినేట్ అయ్యారంటూ వాయించేశారు. నామినేట్ అవకుండా ఉండాల్సింది పోయి సింపతి కోసం ట్రై చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ముందుగా గంగవ్వను సేవ్ చేశారు.
అయితే నామినేట్ అవడానికి కరాటే కల్యాణి కారణం చెప్పింది. గిల్ట్‌తో నామినేట్ అయ్యానని ఆమె చెప్పడంతో వీడియో చూపించి మరీ క్లాస్ తీసుకున్నారు. నామినేషన్ ప్రక్రియ చాలా ముఖ్యమైనదని బిగ్‌బాస్ హెచ్చరించినప్పటికీ నోయెల్ ర్యాప్ పాడి మరీ కామెడీ చేసేశాడు. అలా కామెడీ చేసేశారని.. ర్యాంకింగ్‌లు ఇచ్చుకుని మరీ నామినేట్ అయ్యారని.. ఇది సేఫ్ గేమ్ అని నాగ్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అనంతరం ‘హీరో - జీరో’ అనే టాస్క్ ఆడించారు. హీరో అన్న వారిని చైర్‌లో కూర్చోబెట్టాలి. జీరో అన్నవారిని గేటు నుంచి బయటకు నెట్టాలని తెలిపారు. అమ్మ రాజశేఖర్‌ను నోయెల్ హీరో అనడంతో ఇచ్చిన కారణం కరెక్టుగా లేదంటూ నాగ్ ఫైర్ అయ్యారు.
గేమ్‌లో భాగంగా.. దేవి తీవ్ర స్థాయిలో ఫైర్ అయిపోయింది. కామెడీ చేస్తే హీరోలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అరియానాను హీరోని చేసిన దేవి.. అమ్మ రాజశేఖర్, కల్యాణి ఇద్దరూ జీరోలని దేవి చెప్పడంతో.. నాగ్ ఒక్కరినే జీరో చేయాలని చెప్పడంతో అమె అమ్మ రాజశేఖర్‌ను జీరోను చేశారు. నామినేషన్స్ తరువాత తనను సింగిల్ చేశారని దేవి తెలిపారు. తోటి కంటెస్టెంట్లతో పని లేదని నాగ్.. దేవికి తెలిపారు. ఇక కుమార్ సాయి జీరో గురించి చెప్తుంటే గంగవ్వ దిగొద్దు అన్నా దిగావంటూ గంగవ్వ అతనిపై ఫైర్ అయ్యారు. లాస్య.. జీరోగా అమ్మ రాజశేఖర్‌ను ప్రకటించడంతో ఆయన బాగా హర్ట్ అయ్యారు. నన్ను పంపించేయండి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అమ్మ రాజశేఖర్ హౌస్‌లో ఉండాల్సిందేనని గంగవ్వ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అమ్మ రాజశేఖర్‌ను జీరో చేయడంలో భాగంగా లాస్య.. దివి టాపిక్ తీయడంతో ఇద్దరి మధ్యా క్లాష్ అయింది. బ్రేక్ తర్వాత నాగ్.. డబుల్ ఎలిమినేషన్ గురించి ప్రకటించారు. కరాటే కల్యాణి ఎలిమినేట్ అయినట్టుగా ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments