రూ.50 లక్షలు చొప్పున విరాళం ప్రకటించిన నాగ్, ఎన్టీఆర్..
Send us your feedback to audioarticles@vaarta.com
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కదిలింది. ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన వారికి బాసటగా నిలిచింది. రాష్ట్ర చరిత్రలోనే రెండవ అతి పెద్ద వర్షంగా ఇప్పుడు కురుస్తున్న వర్షాలు చరిత్రను సృష్టించాయి. చెరువులు ఉప్పొంగాయి. ప్రతి ఏరియా కూడా జల దిగ్బంధంలో ఉండిపోయింది. వరద ప్రవాహంలో చిక్కి సామాన్యులు చిగురుటాకుల్లా వణికి పోతున్నారు. నగరమంతా వర్షాలు. కాలనీలకు కన్నీళ్లు తప్ప మరొకటి లేదు. ఎక్కడ చూసినా నీళ్లే. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. జనమంతా ప్రాణాలు అరచేతపట్టుకుని ఉన్నారు. ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఆస్తి నష్టమూ అపారం... ఇలాంటి సమయంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి హీరోలంతా స్పందిస్తున్నారు.
హీరో నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తమ వంతు సాయంగా చెరొక రూ.50 లక్షలు ప్రకటించారు. ‘‘భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజల జీవితం దుర్భరంగా మారింది. రూ.550 కోట్లను తక్షణ సాయంగా విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి నా అభినందనలు. ఈ విపత్కర పరిస్థితుల్లో నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ.50 లక్షలు విరాళంగా ఇస్తున్నా’’ అని నాగ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అలాగే.. ‘‘భారీ వర్షాలు, వరదల కారణంగా ఎన్నో జీవితాలు సర్వనాశనమయ్యాయి. నా వంతు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ.50 లక్షలు విరాళం ప్రకటిస్తున్నా. హైదరాబాద్‌ని పునర్మించుకునేందుకు మనందరం సాయం చేద్దాం’’ అంటూ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout