నాగ్ హ‌ర్ర‌ర్ మూవీ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

  • IndiaGlitz, [Friday,October 28 2016]

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున... ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ మూవీ త‌ర్వాత నాగార్జున రాజు గారి గ‌ది సీక్వెల్ లో న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇదే విష‌యం పై ఇటీవ‌ల నాగార్జున‌ను సంప్ర‌దిస్తే...మ‌ల‌యాళం రీమేక్ ఇది. ఫోన్ లో మ‌ల‌యాళం వెర్షెన్ చెప్పారు తెలుగు నేటివిటికి ఎలా మారుస్తారు అని అడిగాను. ఇంకా నాకు క‌థ చెప్ప‌లేదు అన్నారు.

ఇదిలా ఉంటే...న‌రుడా డోన‌రుడా ఆడియో ఫంక్ష‌న్ లో నాగార్జున మాట్లాడుతూ...న్యూ జోన‌ర్ లో ట్రై చేద్దామ‌ని ఇటీవ‌ల ఓ క‌థ విన్నాను. ఆ క‌థ విన్న‌ప్ప‌టి నుంచి నిద్ర‌ప‌ట్ట‌డం లేదు. అంత బాగుంది ఆ క‌థ అని చెప్పారు. దీనిని బ‌ట్టి నాగ్ చెప్పింది హ‌ర్ర‌ర్ మూవీ గురించే అనిపిస్తుంది. ఈ హ‌ర్ర‌ర్ మూవీని తెర‌కెక్కించ‌నున్న డైరెక్ట‌ర్ ఓంకార్ ను కూడా ఇదే విష‌యం గురించి సంప్ర‌దిస్తే....నాగార్జున గార్కి రీసెంట్ గా క‌థ చెప్పాను. ఆయ‌న‌కు చాలా బాగా న‌చ్చింది. పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌చేస్తాను అన్నారు. సో...నాగ్ హ‌ర్ర‌ర్ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసారు అని తెలుస్తుంది. ఇక అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయాలి అంతే..!

More News

ట్రెమండస్ పెనింగ్స్ సూపర్ ట్తెచ్చుకున్న కార్తీ 'కాష్మోరా'

యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కాష్మోరా'.

అక్కినేని నాగార్జున విడుదల చేసిన 'నరుడా..! డోనరుడా' ఆడియో

హీరో సుమంత్ కథానాయకుడుగా రూపొందుతోన్న చిత్రం `నరుడా..! డోనరుడా..!`. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.

ఎన్టీఆర్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో...!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రం రిలీజ్ కావ‌డం...బ్లాక్ బ‌ష్ట‌ర్ అవ్వ‌డం...50 రోజులు పూర్తి చేసుకోవ‌డం కూడా జ‌రిగిపోయింది. కానీ...ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవ‌రితో అనేది మాత్రం తెలియ‌లేదు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ త‌దుప‌రి చిత్రం ఉంటుంది అనుకున్నారు.

'ఎంత వరకు ఈ ప్రేమ' పాటలు విడుదల

`రంగం` వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ `కవలై వేండాం`.

సూర్య ఎస్ 3 మోషన్ పోస్టర్ రిలీజ్..!

సూర్య-హరి కాంబినేషన్ లోరూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఎస్ 3.