14 ఏళ్ల తరువాత నాగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున, సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మది సెన్సేషనల్ కాంబినేషన్ అన్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం శివ బ్లాక్బస్టర్ మూవీ మాత్రమే కాదు ట్రెండ్ సెట్టర్ కూడా. అయితే ఆ తరువాత వీరి కలయికలో వచ్చిన అంతం, గోవిందా గోవింద నిరాశపరిచాయి. దాదాపు 24 ఏళ్ల తరువాత ఈ కాంబినేషన్లో మళ్లీ ఓ సినిమా రాబోతోంది.
యాక్షన్ థ్రిల్లర్ గా సాగే ఈ చిత్రంలో నాగ్ పోలీస్ గా కనిపించనున్నాడు. ఇదివరకు నాగ్.. నిర్ణయం, శాంతి క్రాంతి, రక్షణ, ఆవిడా మా ఆవిడే, శివమణి చిత్రాల్లో పోలీస్ అధికారిగా సందడి చేశారు. అయితే వీటిలో శివమణి మాత్రమే మంచి విజయం సాధించింది. మళ్లీ 14 ఏళ్ల తరువాత పోలీస్ అవతారమెత్తుతున్న నాగ్.. శివమణిలాగే మరో సక్సెస్ఫుల్ మూవీని పోలీస్ అధికారి పాత్రలో సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com