విభిన్నమైన చిత్రాలని నిర్మించగల ప్రతిభ ని తయారు చేయడమే లక్ష్యం - నాగార్జున

  • IndiaGlitz, [Monday,May 07 2018]

'AISFM గ్రాండ్ ఫిలిం ఫెస్టివల్ 2018 ' లో భాగంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్ విద్యార్థులు నిర్మించిన 8  చిత్రాల ప్రదర్శన అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ ఫిలిం అండ్ మీడియా (AISFM) లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు నిర్మించిన చిత్రాల ప్రదర్శనతో అన్నపూర్ణ స్టూడియోస్ లో మే 5 న 'గ్రాడ్ ఫిలిం ఫెస్టివల్' ప్రారంభమైంది.

రెండు రోజుల పాటు జరిగిన ఈ ఫిలిం ఫెస్టివల్ లో AISFM లో BFA , MA , MMBA కోర్సులలో చివరి సంవత్సరం గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు నిర్మించిన 8 విభిన్నమైన, ఆలోచన రేకెత్తించే కధాంశాలతో ఉన్న చిత్రాలని ప్రదర్శించారు.

ప్రదర్శింపబడిన చిత్రాలు :

'ఆత్మ రామ ఆనంద రమణ' - మహేష్ గడ్డం

'ది ఫాల్ ఇంతో స్ప్రింగ్' - అతుల్ ప్రభాకరన్ 

'ఫెదర్స్ అఫ్ గ్రీన్' - తులసి అగర్వాల్ 

'అప్రాప్త' - క్షేమ బి.కే

'ప్లకెడ్' - తేజస్ యాకోబ్

'మనసుతో మరోసారి' - లొల్ల ఆదిత్య 

'లక్ష్మి గృహ ఉద్యోగ్' - చైతన్య ఖరికార్

'విస్పర్స్' - ఆర్చి సక్సేనా

ఈ చిత్రాల ప్రీమియర్స్ ప్రదర్శనకి, AISFM గ్రాడ్ ఫిలిం ఫెస్టివల్ 2018 కి ఇండస్ట్రీ కి చెందిన పలు ప్రముఖులు జయసుధ, శేఖర్ కమ్ముల, లక్ష్మి మంచు, వెంకీ అట్లూరి, అఖిల్ అక్కినేని, అనిల్ దీపక్ హాజరయ్యి విద్యార్థులతో తమ అభిప్రాయాలని, ఆలోచనలని పంచుకున్నారు.

AISFM చైర్మన్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కి ప్రస్తుతం ఇంతకముందెన్నడు లేనన్ని అవకాశాలున్నాయి. ఈ రంగంలో రాబోయే రోజుల్లో ఒక కొత్త శకం మొదలవబోతోంది. ఈ రంగానికి భాషలకి అతీతంగా ప్రేక్షకులు ఉన్నారు. AISFM లో మేము ఈ ఇండస్ట్రీ అభివృద్ధికి తోడ్పడే టాలెంటెడ్ ఫిలిం మేకర్స్, టెక్నీషియన్స్ అందించే దిశగా కృషి చేస్తున్నాం. గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు వరల్డ్ క్లాస్ స్టూడియో లో చిత్రాలని నిర్మించే అనుభవాన్ని కల్పిస్తున్నాం.

ఇందు కోసం ఆ స్థాయి ఎక్విప్ మెంట్  ని వారికి అందిస్తున్నాం. వినూత్న ఆలోచనల్ని ప్రోత్సహిస్తూ విభిన్నమైన అంశాలతో చిత్రాలని నిర్మించగల ప్రతిభ ని తయారు చేయడమే లక్ష్యం. సొసైటీ మీద 'సినిమా' ప్రభావం చాలా ఉంది. యువ దర్శకులు వాస్తవానుగుణంగా తమ కథల్ని రూపొందించినప్పుడు ఎంతో మార్పు వస్తుంది. 

AISFM డైరెక్టర్ అమల అక్కినేని మాట్లాడుతూ , ఈ రోజు ప్రతిభావంతులైన విద్యార్థులు నిర్మించిన వినూత్న ఆలోచనలతో రూపొందబడిన ఈ చిత్రాలని చూడడానికి ఎంతో ఆసక్తి తో ఎదురు చూస్తున్నాం. విద్యార్థులు తమ ప్రతిభ ని ప్రదర్శించే వాతావరణం కల్పించడం, వారు సాధించిన విజయాన్ని అందరితో కలిసి సెలెబ్రేట్ చేసుకోవడం, ఈ ఫిలిం ఫెస్టివల్ ప్రధాన ఉద్దేశం.

ఈ  ఫిలిం ఫెస్టివల్ విద్యార్థులు నిర్మించిన అద్భుత చిత్రాల ప్రదర్శన తో పాటు వాటి గురించి చిత్ర పరిశ్రమ ప్రముఖులు, నిపుణుల అభిప్రాయాలూ, సూచనలు విద్యార్థులకి మరింత ఉపయోగపడతాయి.

సీనియర్ నటి జయసుధ మాట్లాడుతూ,  ఈ AISFM గ్రాడ్ ఫిలిం ఫెస్టివల్ లో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక నటిగా, తమ పని గురించి బాగా తెలిసిన దర్శకులతో పని చేయడం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు.

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణంలో నే ఉన్న ఈ ఫిలిం స్కూల్ విద్యార్థులకి వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అందించడంతో పాటు, సినిమా, మీడియా కల్చర్ ని కూడా చాలా దగ్గిరగా గమనించే అవకాశం కలిపిస్తుంది. ఎంతో మంది లెజెండ్స్ భాగంగా ఉన్న ఈ స్టూడియో నుండి గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు పరిశ్రమ లో తమ ప్రతిభ చాటుతారని నమ్మకంగా చెప్పగలను.

More News

'నా నువ్వే' ఓ బ్యూటీఫుల్ మ్యూజికల్ ల‌వ్ స్టోరీ - నంద‌మూరి క‌ల్యాణ్ రామ్

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం 'నా నువ్వే'.

కొత్త త‌ర‌హా మేన‌రిజ‌మ్స్‌తో నాని?

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఓ మల్టీస్టారర్ మూవీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

సైరాలో బ‌న్ని విల‌న్‌...

అల్లు అర్జున్ 'రేసుగుర్రం'తో విల‌న్‌గా ప‌రిచ‌య‌మైన బోజ్‌పురి న‌టుడు ర‌వికిష‌న్‌. త‌ర్వాత ఈ యాక్ట‌ర్ ప‌లు తెలుగు చిత్రాల్లో త‌న‌దైన విల‌క్ష‌ణ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన సంగ‌తి తెలిసిందే.

మ‌ల‌యాళంలో నాగ్‌...

కింగ్ నాగార్జున ఇప్పుడు మ‌ల‌యాళ సినిమాలో న‌టించ‌బోతున్నారు. మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్‌తో నాగార్జున‌కు మంచి అనుబంధం ఉన్న సంగ‌తి తెలిసిందే.

మ‌ణిర‌త్నం మ‌ల్టీస్టార‌ర్ మూవీ అప్‌డేట్‌

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో 'నవాబ్' (తమిళంలో 'చెక్క చివంత వానం') పేరుతో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.