అమ్మే నా కూతురు అయ్యింది - నాగార్జున
- IndiaGlitz, [Monday,January 30 2017]
అక్కినేని నాగ చైతన్య - సమంత గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. నిన్న ఆదివారం చైతన్య - సమంతల నిశ్చితార్ధం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ మరియు సన్నిహితుల సమక్షంలో హిందు, క్రైస్తవ సంప్రదాయం ప్రకారం నిశ్చితార్ధం జరిగింది.
ఈ సందర్భంగా నాగార్జున ట్విట్టర్ లో స్పందిస్తూ...ఇక అఫిషియల్ మా అమ్మ నా కూతురు అయ్యింది అంటూ చైతన్య, సమంతల నిశ్చితార్ధ వేడుక ఫోటోలను పోస్ట్ చేసారు. అఖిల్ - శ్రేయా భూపాల్ నిశ్చితార్ధం డిసెంబర్ లో జరిగిన విషయం తెలిసిందే. ఇలా ఇద్దరు కొడుకుల నిశ్చితార్ధం జరగడంతో నాగ్ చాలా సంతోషంగా ఉన్నారు. నాగార్జున నటించిన తాజా చిత్రం ఓం నమో వేంకటేశాయ చిత్రం ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
#Chaisam It's official now. My mother is my daughter now. Couldn't be happier!!more pics to come pic.twitter.com/YTv2RULSMO
— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 29, 2017