నిర్మాతగా చెబుతున్నాను..నా హీరో సూపర్ - 'రా రండోయ్..వేడుక చూద్దాం' పాటల వేడులో కింగ్ నాగార్జున

  • IndiaGlitz, [Monday,May 22 2017]

యువ సామ్రాట్‌ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కుర‌సాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించి చిత్రం 'రారండోయ్‌ ..వేడుక చూద్దాం' సినిమా పాటల విడుదల కార్యక్రమం పాటల వేడుక చూద్దాం ఆదివారం అన్నపూర్ణ సెవెన్‌ ఏకర్స్‌లో జరిగింది. ఆడియో జ్యూక్‌ బ్యాక్స్‌ను కింగ్‌ నాగార్జున విడుదల చేశారు. తొలి సీడీని కింగ్‌ నాగార్జున విడుదల చేసి తొలి సీడీని యువ సామ్రాట్‌ నాగచైతన్యకు అందజేశారు. ఈ సందర్భంగా...
మళ్ళీ వస్తున్నాం, బ్లాక్‌ బస్టర్‌ కొడుతున్నాం
కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ - ''ఒక సంవత్సరం మా అబ్బాయిలకు రెండు బ్లాక్‌బస్టర్స్‌ ఇస్తానని అభిమానులకు ప్రామిస్‌ చేశాను. అందులో ఒక బ్లాక్‌బస్టర్‌ 'రా రండోయ్‌ వేడుక చూద్దాం'.ఇక సెకండ్‌ హిట్‌ అఖిల్‌ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి చాలా మంచి కారణం. అందులో ముఖ్యుడు దేవిశ్రీప్రసాద్‌, తను ఎప్పుడూ నేను, తను చేసిన మన్మథుడు సినిమానే తన కెరీర్‌ స్టార్ట్‌ అయ్యిందని అంటుంటాడు. తను ఎప్పుడూ నా సినిమాలకు మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. ఈ సినిమాకు కూడా అద్భుతమైన మ్యూజిక్‌తో పాటు మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించాడు. ఈ సినిమాతో దేవిశ్రీప్రసాద్‌కు హ్యాట్రిక్‌ గ్యారంటీ. కళ్యాణ్‌కృష్ణ క్యారెక్టర్స్‌ను బాగా రాస్తాడు. నాకు బంగార్రాజు క్యారెక్టర్‌ను రాసినట్టే ఈ సినిమాలో భ్రమరాంబ క్యారెక్టర్‌ను రాశాడు. అలాగే శివ అనే క్యారెక్టర్‌లో చైతును ఆల్‌రౌండర్‌గా చూపించాడు. విశ్వేశ్వర్‌ ప్రతి సీన్‌ను అద్భుతంగా, అందంగా చూపించాడు. రకుల్‌ని ఇప్పటి వరకు గ్లామర్‌గా, మోడ్రన్‌గా చూసుంటారు. ఈ సినిమాలో మొండితనం, పెంకితనం ఉన్న భ్రమరాంబ క్యారెక్టర్‌లో చక్కటి పెర్‌ఫార్మెన్స్‌ చేసింది. ఇక చైతు గురించి చెప్పాలంటే కొడుకు గురించి తండ్రి పొగడ కూడదు. కానీ ఈ సినిమాకు నేను తండ్రిని కాను, నిర్మాతను. నిర్మాతగా చెబుతున్నాను. నా హీరో సూపర్‌. అభిమానులు తనను ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఈ సినిమాలో కనపడతాడు. షర్ట్‌ బటన్స్‌ తెగిపోతాయి. ఈ సినిమా చూసిన వారందరూ చైతుతో లవ్‌లో పడతారు. సోగ్గాడే చిన్ని నాయనా సమయంలో నేను మేం మళ్ళీ వస్తున్నాం, కచ్చితంగా బ్లాక్‌ బస్టర్‌ కొడుతున్నాం అని ఎలా చెప్పానో, అలాగే ఇప్పుడు చెబుతున్నాను. ఈసారి కూడా మేం వస్తున్నాం, కొడుతున్నాం. ఇది ఫిక్స్‌'' అన్నారు.
అభిమానులు నన్నెలా చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమా ఇది
అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ - ''అక్కినేని అభిమానులకు థాంక్స్‌. సినిమా ట్రైలర్‌ విడుదలైన 24 గంటల్లోనే వన్‌ మిలియన్‌ వ్యూస్‌ వచ్చింది. ప్రతి సాంగ్‌కు రెస్పాన్స్‌ చాలా బాగా వచ్చింది. నేను చేసిన ఏ సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్‌ రాలేదు. నాన్నకు, కళ్యాణ్‌కు థాంక్స్‌ చెప్పుకోవాలి. ఈ సినిమా చేసే ముందు కాస్తా టెన్షన్‌ పడ్డాను. ఇప్పటి వరకు ఒక సేఫ్‌జోనర్‌లో సినిమా చేస్తున్నాను. ఇప్పుడు ఈ సినిమాతో కమర్షియల్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నామని అనుకున్నాను. కానీ కళ్యాణ్‌ సినిమాను అద్భుతంగా తీశాడు. నాన్నగారైతే మనం సినిమాను తీసేటప్పుడు ఏ ఇన్‌టెన్షన్‌తో తీశారో, ఈ సినిమాను కూడా అదే ఇన్‌టెన్షన్‌తో చేశారు. నన్ను నెక్స్‌ట్‌ లెవల్‌కు తీసుకెళ్ళే సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన సాంగ్స్‌తో పాటు అద్భుతమైన ఆర్‌.ఆర్‌ ఇచ్చాడు. మరో సూపర్‌హిట్‌ ఆల్బమ్‌ ఇచ్చాడు. అభిమానులు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో, అలాంటి సినిమా ఇది'' అన్నారు.
చైతు నిజంగా బంగారమే
దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ కుర‌సాల మాట్లాడుతూ - ''నేను ఈ రోజు ఇలాంటి స్టేజ్‌పై నిలబడి మాట్లాడుతున్నానంటే అందుకు కారణం అక్కినేని నాగార్జునగారు. ఆయన్ను ప్రతి క్షణాన్ని, ఆయన ఇచ్చిన విలువైన సలహాలను నేనెప్పటికీ మరచిపోలేను. ఆయన రుణాన్ని జీవితాంతం తీర్చుకోలేను. నాగార్జునగారు నాకు బిగ్‌ బ్రదర్‌లాంటివారు. దేవిశ్రీప్రసాద్‌గారు చాలా మంచి మ్యూజిక్‌, ఆర్‌.ఆర్‌ ఇచ్చారు. చైతును అందరూ ఎందుకు అంత ఇష్టపడతారో ఈ సినిమాలో తనతో వర్క్‌ చేసిన తర్వాత తెలిసింది. చైతు నిజంగానే బంగారం. తను నాకు మంచి ఫ్రెండ్‌లా దొరికాడు. రకుల్‌ భ్రమరాంబ క్యారెక్టర్‌లో బాగా యాక్ట్‌ చేసింది. విసుగారు, గౌతంరాజుగారు, సాహిసురేష్‌గారు సహా అందరికీ థాంక్స్‌'' అన్నారు.
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ - ''భ్రమరాంబ అనే క్యారెక్టర్‌ చేయడం నా అదృష్టం. ఇంత మంచి క్యారెక్టర్‌ నేను చేయడానికి కారణమైన డైరెక్టర్‌ కళ్యాణ్‌గారికి, నాగార్జునగారికి, నాగచైతన్యకు థాంక్స్‌. ఈ పాత్రలో ప్రేక్షకులు నన్ను గుర్తుపెట్టుకునేంత బావుంటుంది'' అన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్‌, సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, భాస్కరభట్ల, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.
యువసామ్రాట్‌ నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, సంపత్‌, కౌసల్య, ఇర్షాద్‌(పరిచయం), చలపతిరావు, అన్నపూర్ణ, ప థ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్‌, పోసాని క ష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖావాణి, అనితా చౌదరి, రజిత, ప్రియ, తాగుబోతు రమేష్‌, ఇష్క్‌ మధు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, డాన్స్‌: రాజుసుందరం, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, నిర్మాత: నాగార్జున అక్కినేని, కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల.

More News

Sonam Kapoor cheers for 'Sachin: A Billion Dreams'

Only 6 days are remaining for the Sachin's biographical drama, 'Sachin: A Billion Dreams' to hit the theater and the excitement and anticipation among the fans are at its peak. The fan base of the legend comprises of people from all walks of life. One such fan is Bollywood's own style icon, Sonam Kapoor. She took to social media to express her excitement and also shared her favorite Sachin Moment.

Jeeva slams Seeman for questioning Rajini

Rajinikanth's impending political entry has caused a furore among politicians and Naam Tamizhar Katchi head Seeman had challenged the Superstar if he had guts to reveal his remuneration for the blockbuster 'Kabali'.

DYK? Sushant & Kriti learnt to swim for 'Raabta' underwater KISSING scene

Sushant Singh Rajput and Kriti Sanon are gearing up for the promotions of their upcoming film 'Raabta'. Did you know that the dynamic duo didn’t know how to swim and had to learn to do so for the film?

Farah Khan celebrates 25 years in film industry

Farah Khan, now a successful filmmaker, started her career in Indian cinema as a choreographer 25 years ago with Aamir Khan-starrer 'Jo Jeeta Wohi Sikandar'. She feels fortunate for having got love and opportunities in filmdom.

Rasika Dugal excited for her Cannes debut

Rasika Dugal is excited and hopeful that her maiden experience at the celebrated Cannes Film Festival, where a curtain raiser of her film 'Manto' is being hosted, will be a special one.