అదే నాకో పెద్ద ఛాలెంజ్: ‘బిగ్‌బాస్ 4’పై నాగార్జున
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు టెలివిజన్‌లో అత్యుత్తమమైన రేటింగ్స్‌ని సాధించి, వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన అతిపెద్ద నాన్ ఫిక్షన్ షో ‘బిగ్‌బాస్ 4’ కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభానికి సిద్ధమవుతోంది. మొదటి రెండు సీజన్లు ప్రేక్షకులను అమితంగా ఆక్టుకున్నాయి. వీటితో పోలిస్తే మూడో సీజన్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో సీజన్ 3లోని బ్యాక్ డ్రాప్‌లను అధిగమించేలా.. ప్రేక్షకులను ఆకట్టుకునేలా సీజన్ 4 సిద్ధమవుతోంది. సీజన్ 3కి హోస్ట్‌గా వ్యవహించిన నాగార్జునే తిరిగి 4వ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని బిగ్‌బాస్ నిర్వాహకులు విడుదల చేశారు.
ఈ ప్రచార చిత్రంలో నాగార్జున్ మూడు పాత్రల్లో కనిపించారు. తాతయ్య, కొడుకు, మనవడు పాత్రల్లో నాగార్జున కనిపించారు. ఈ మూడు పాత్రలతో షో ఎలా ఉండబోతోందో వివరించారు. గతంలో లేని వినోదాన్ని కూడా అందించనున్నట్టు స్టార్ మా వెల్లడించింది. కాగా ఈ షో ఎన్ని రోజులు ఉండబోతోందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అలాగే కంటెస్టెంట్లు ఎవరనే దానిపై ఊహాగానాలే తప్ప ‘మా’ యాజమాన్యం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ సారి నాగ్ రెమ్యునరేషన్‌పై కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా.. అంటే మొదటి సీజన్ హోస్ట్ ఎన్టీఆర్ కానీ.. రెండవ సీజన్ హోస్ట్ నాని తీసుకోనంత భారీ రెమ్యునరేషన్‌ను నాగ్ తీసుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది.
కాగా హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. ప్రోమో కోసం మళ్లీ షూటింగ్ ఫ్లోర్‌కి రావడం చాలా సరదాగా ఉందన్నారు. గత సీజన్ గొప్ప విజయం అందుకున్న తర్వాత ఇప్పుడు ప్రేక్షకులకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సర్‌ప్రైజ్‌లు కూడా అందించే స్థాయిలో ప్రయత్నం చేయబోతున్నామన్నారు. ప్రచార చిత్రంలో తన లుక్ విషయానికి వస్తే.. మూడు పాత్రలు చేయడం, పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడం, వాయిస్‌లో జాగ్రత్తలు, మేనరిజంలో వైవిధ్యం చూసుకుంటూ.. అతి తక్కువ సమయంలో షూట్ చేయడం పెద్ద ఛాలెంజ్ అని నాగార్జున పేర్కొన్నారు. కానీ తాను దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ చేశానని తెలిపారు. లైఫ్, హోప్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదని నమ్ముతానన్నారు. మనం గత కొన్ని నెలలుగా ఎంతో కష్టకాలాన్ని చూశామని... క్లీన్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు మనం ఆస్వాదించే లగ్జరీల్లో ఒకటి అయిందన్నారు. ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్ 4లో అలాంటి వినోదాన్ని అందించబోతున్నామని నాగార్జున పేర్కొన్నారు.
#BiggBossTelugu4 Entertainment Like Never Before...What A Wow-Wow!!! Coming Soon On @StarMaa @iamnagarjuna is watching you ??️ pic.twitter.com/P1rCiUvZ6F
— starmaa (@StarMaa) August 15, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com