నాగార్జున - రాఘవేంద్రరావుల హథీరామ్ బాబా రికార్డింగ్ ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి ఈ మూడు భక్తిరస చిత్రాలు అధ్యాత్మిక అద్భుత చిత్రాలుగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా నాగార్జున - రాఘవేంద్రరావు కలసి మరో భక్తిరస చిత్రం చేస్తున్నారు. ఈసారి వెంకటేశ్వర స్వామి భక్తుడు హథీరామ్ బాబా జీవిత చరిత్రను తెరకెక్కించనున్నారు.
ఈ చిత్రానికి స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన పాటను ప్రసాద్ ల్యాబ్ లో రికార్డ్ చేసారు. ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ లో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments