వార్తల్లో మళ్లీ నాగార్జున, ధనుష్ సినిమా ..?
Send us your feedback to audioarticles@vaarta.com
రెండేళ్ల క్రితం టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, కోలీవుడ్ విలక్షణ హీరో, నిర్మాత, దర్శకుడు ధనుష్ కాంబినేషన్లో ఓ సినిమా ప్రారంభమైంది. ‘నాన్ రుద్రన్’ అనే పేరుతో ధనుష్ దర్శకత్వంలోనే స్టార్ట్ అయిన ఈ చిత్రం బడ్జెట్ పరిమితులు దాటుతుందనే కారణంతో నిర్మాతలు వెనక్కి తగ్గడంతో ఆగింది. అయితే ఈ సినిమాను మళ్లీ ధనుష్ ట్రాక్ ఎక్కించే పనిలో ఉన్నాడని అంటున్నారు. బడ్జెట్ తగ్గించి అందుకు తగినట్లు షెడ్యూల్స్ ప్లాన్ చేసి సినిమాను ట్రాక్ ఎక్కించాలని ధనుష్ అనుకుంటున్నాడని.. ఇండస్ట్రీలోని కొంతమంది నిర్మాతలతో ధనుష్ చర్చలు జరుపుతున్నాడని, అంతా ఓకే అయితే మళ్లీ నాగార్జున, ధనుష్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుతం ధనుష్ హీరోగా కర్ణన్ అనే సినిమాతో పాటు పేట ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో జగమే తంత్రం అనే సినిమా రూపొందుతోంది. జగమే తంత్రం సినిమాను ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరో పక్క నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అలాగే బిగ్ బాస్ సీజన్ 4కి కూడా నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశముందని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments