Nagarjuna vs Narayana: ‘‘నారాయణ  నారాయణ’’ అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చిన నాగ్, బిగ్‌బాస్ స్టేజ్ నుంచే

  • IndiaGlitz, [Sunday,September 11 2022]

బిగ్‌బాస్ షోపై సీపీఐ జాతీయ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలు అంతా ఇంతా కాదు. అదో బూతు షో అని, పనికిమాలిన షో అని, సమాజ విలువలను దిగజారుస్తోందని ఎన్నోసార్లు బిగ్‌బాస్‌ని ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. అంతేకాదు అదో బ్రోతల్ హౌస్ అన్న ఆయన.. ఈ విషయంలోకి నాగార్జునను కూడా లాగారు. ఆయనకు డబ్బులే ముఖ్యమని.. వేరే ఇతర విషయాలతో నాగార్జునకు పనిలేదని, చిరంజీవికి నాగ్‌కు ఎంతో తేడా వుందని చెప్పుకొచ్చాడు. సాధారణంగా నాగ్‌కు ఇండస్ట్రీలో మృదు స్వభావిగా పేరు. ఇన్నేళ్ల కెరీర్‌లో తన పని తాను చేసుకుపోవడం, వివాదాలకు దూరంగా వుండటం వంటి విషయాలను ఆయన పక్కాగా ఫాలో అవుతూ వస్తున్నారు. తనపై విమర్శలు, రూమర్స్ వచ్చినా నాగార్జున ఏనాడూ పట్టించుకోలేదు. అయితే బిగ్‌బాస్ హోస్ట్‌గా మారినప్పటి నుంచి నాగ‌పైనా విమర్శలు వస్తున్నాయి. దీంతో జీవితంలో తొలిసారిగా నాగార్జున కూడా స్పందించాల్సి వచ్చింది.

రోహిత్ - మెరీనాలను అస్త్రాలుగా చేసుకుని:

శనివారం ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేసింది స్టార్ మా. అందులో హౌస్‌లో వున్న కపుల్‌ను పిలుస్తారు నాగ్. రోహిత్ వెళ్లి మెరీనాని టైట్ హగ్ చేసుకో అంటారు. ‘‘నారాయణ... నారాయణ వాళ్లిద్దరై మ్యారీడ్’’ అంటారు నాగ్. దీనిని బట్టి నారాయణకు నాగ్ ఇచ్చి పడేసినట్లే కనిపించింది. తనకు హగ్ ఇవ్వడం లేదని, చనువుగా వుండటం లేదని అప్పుడప్పుడు హౌస్‌లో రోహిత్‌పై మెరీనా అలుగుతూ వుండటాన్ని తీసుకుని నారాయణకు ధీటుగా సమాధానం ఇచ్చారంటూ నెటిజన్లు చెవులు కోరుక్కుంటున్నారు.

మీకు లైసెన్స్ వుందమ్మా :

మళ్లీ ఇది కాంట్రవర్సీ కాకుండా.. రోహిత్ కాస్త మెరీనాను పట్టించుకోమ్మా అని చెబుతూ విషయాన్ని డైవర్ట్ చేయగలిగారు నాగ్. అందరూ వున్నారని ఇబ్బంది పడకూడదు, నీకు లైసెన్స్ వుందని చెప్పడం ద్వారా బయటివాళ్లకి , నారాయణ అంటున్న మాటలకు సమాధానం చెప్పేశారు నాగ్. మరి దీనికి సీపీఐ నారాయణ ఎలాంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి.

More News

Krishnam Raju: చిరంజీవితో ప్రత్యేక అనుబంధం... మెగాస్టార్‌ బర్త్‌డేకి షాకిచ్చే గిఫ్ట్

దిగ్గజ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ మూగబోయింది. అనారోగ్యంతో బాధపడుతూ..

Krishnam Raju: అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు... సీఎం కేసీఆర్ ఆదేశాలు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని దిగ్గజ నటుల్లో ఒకరైన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Krishnam Raju: నాయకుడిగా, నటుడిగా ఆయన సేవలు ఆదర్శనీయం : కృష్ణంరాజు మృతిపట్ల మోడీ సంతాపం

తెలుగు సినీ దిగ్గజం, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

Krishnam Raju: అసలు కృష్ణంరాజు మరణానికి కారణమేంటీ..?

తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్‌గా, అలనాటి అగ్రనటుల్లో ఒకరిగా విశేష ప్రజాదరణ వున్న కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత.... శోకసంద్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. అలనాటి నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు