108 వాహనాన్ని నడిపి సందడి చేసిన రోజా

  • IndiaGlitz, [Tuesday,July 07 2020]

నగరి ఎమ్మెల్యే రోజా ఇవ్వాళ 108 వాహనాన్ని పుత్తూరు నగర వీధుల్లో నడిపి సందడి చేశారు. ఈ దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా చూశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల పెద్ద మొత్తంలో 104, 108లను వాహనాలకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చి తన తండ్రి కలను సాకారం చేసిన విషయం తెలిసిందే. ఆ వాహనాలన్నింటినీ అన్ని జిల్లాలు, నియోజకవర్గాలకు తరలించారు. తమ నియోజకవర్గానికి వచ్చిన పది వాహనాలను ఎమ్మెల్యే రోజా నేడు ప్రారంభించారు. ముందుగా స్థానిక పున్నమి జంక్షన్‌లోని వైఎస్సార్ విగ్రహానికి గజమాల వేశారు. అనంతరం 108, 104 వాహనాలకు పూజ చేశారు. అనంతరం తొలి వాహనాన్నే తనే స్వయంగా నడపుతూ సందడి చేస్తుంటే.. రోడ్డు వెంట ఉన్న ప్రజలు ఆసక్తిగా చూశారు.