Nagaram Review
తెలుగు యంగ్ హీరోస్‌లో మంచి నటుడుగా పేరున్న సందీప్ కిషన్..తెలుగులో సూపర్‌హిట్ సాధించి చాలా కాలమైంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత ఆ రేంజ్ హిట్ సందీప్ కిషన్‌కు రాలేదేనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో సందీప్ తమిళంలో చేసిన మా నగరం సినిమాను తెలుగులో నగరం అనే పేరుతో ఒకేసారి విడుదల చేశారు. మరి నగరం సందీప్ కిషన్‌కు ఎలాంటి సక్సెస్ ఇచ్చిందో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం...
కథ:
శ్రీ అనే యువకుడు ఉద్యోగం కోసం నెల్లూరు నుండి సిటీకి వస్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళి సెలక్ట్ అవుతాడు. ఒక హోటల్‌కు వెళ్ళిన శ్రీని కొందరు దుండగులు కొట్టి, అతని ఓరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్న బ్యాగును తీసుకుని పారిపోతారు. సందీప్ కిషన్. మాస్ కుర్రాడు. ఓ కంపెనీ హెచ్.ఆర్‌గా పనిచేసే రెజీనాను ప్రేమిస్తాడు. రెజీనాకు సందీప్‌కిషన్‌పై ప్రేమ ఉన్నా, బయటకు చెప్పదు. అదే సమయంలో రెజీనాపై యాసిడ్ పోస్తానని ఒకడు సందీప్ కిషన్‌తో చెప్పడంతో సందీప్ కిషన్ అతనిపై యాసిడ్ పోస్తాడు. పోలీసులు సందీప్‌ను అరెస్ట్ చేస్తారు. అలాగే ఓ కారణంతో సిటీలో కారు నడిపి తన కొడుక్కి వైద్యం చేయించాలనుకునే తండ్రి చార్లి, శ్రీ ఒకే కారులో ప్రయాణిస్తుంటారు. అదే సమయంలో మధుసూదన్ పెద్ద రౌడీ. అతని కొడుకుని ఎవరో కిడ్నాప్ చేస్తారు. తన కొడుకు కోసం మధుసూదన్ కిడ్నాపర్స్‌ను వెతుకుతుంటాడు. మరి అందరూ ఎలా, ఎక్కడ, ఏ సందర్భంలో కలుస్తారు? అనే విషయం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
సమీక్ష:
కొత్త కుర్రాడైనా శ్రీ చాలా చక్కగా నటించాడు. అలాగే సందీప్ కిషన్ మాస్ రోల్‌లో చక్కగా నటించాడు. అలాగే రెజీనా పాత్ర చిన్నదే అయినా తన పాత్రకు న్యాయం చేసింది. మధుసూదన్, చార్లి సహా మిగిలిన పాత్రధారులందరూ వారి వారి పాత్రల్లో ఇదిగిపోయారు. రచయిత, దర్శకుడు అయిన లోకేషన్ కనకరాజ్ సినిమా ప్రారంభం నుండే డైరెక్ట్ కథలోకి ఎంట్రీ ఇచ్చి, ప్రతి పాత్రకు ముఖ్యత్వం ఇస్తూ ఆ పాత్రలను ఒకదానికొకటి లింక్ చేస్తూ క్లైమాక్స్ వరకు ఆసక్తికరంగా నడిపించాడు. కథ పరంగా కంటెంట్‌లో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ కూడా ఓరిజినల్‌గా ఉన్నట్లే తెరకెక్కించారు. అలాగే సినిమాలోని పాత్రలను వేటికవే సపరేట్ ట్రాక్స్‌తో నడుస్తున్నా, అన్ని పాత్రలను ఒకతాటి క్రిందకు తీసుకురావడంలో దర్శకుడు పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. జావేద్ రియాద్ సంగీతం బావుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సెల్వకుమార్ సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటర్, స్క్రీన్‌ప్లే రైటర్ ఫిలోమిన్ రాజ్ సినిమాలో ఎక్కడా కన్ఫ్యూజన్‌కు తావులేకుండా సినిమాను షార్ప్ ఎడిట్ చేశారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ఎమోషన్స్ అన్నీ ప్రేక్షకుడుకి నచ్చుతాయి. తెలుగులో చందమామ కథలు సహా చాలా సినిమాల్లో ఇలాంటి స్క్రీన్‌ప్లే మనకు కనపడుతుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.
బోటమ్ లైన్: నగరం.. విభిన్న పాత్రల సమాహారం
Nagaram English Version Review
- Read in English