సందీప్ కిషన్ , రెజీనా జంటగా ద్విభాషా చిత్రం 'నగరం'
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు సందీప్ కిషన్, రెజీనా జంటగా ఎ.కె.ఎస్. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై లోకేష్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో అశ్విన్‌కుమార్ సహదేవ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'నగరం' అని పేరు పెట్టారు. నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని వచ్చేవారం రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్‌కిషన్ ప్రస్తుతం సి.వి.కుమార్ దర్శకత్వంలో మాయావన్, కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం సినిమా చేస్తున్నాడు. దాంతో పాటుగా ఈ `నగరం` చిత్రం కూడా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంగీతం జావేద్ అందిస్తుండగా సెల్వకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com