'నాగభరణం' ఆడియో రిలీజ్ డేట్.....
Send us your feedback to audioarticles@vaarta.com
రమ్యశ్రీ టైటిల్ పాత్రలో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నాగభరణం`. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విజువల్ వండర్‌గా తెరకెక్కింది. సినిమాను మూడు భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఏడు దేశాలకు చెందిన 576 మంది విజువల్ ఎఫెక్ట్స్ చేసే టెక్నిషియన్స్ సినిమా కోసం నిరంతరం శ్రమించారు.
ఓ అమ్మాయి తన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి పాముగా మారి సాధించుకుందా లేదా అనేదే ముఖ్య కథాంశంగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో జ్ఞానవేల్ రాజా విడుదల చేయబోతున్నారని టాక్. అధికారక సమాచారం రావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం చిత్రానికి సంబంధించిన తెలుగు విడుదల హక్కులను ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఫ్యాన్సీ రేటు చెల్లించి దక్కించుకున్నారని సమాచారం. లెటెస్ట్ న్యూస్ ప్రకారం గురు కిరణ్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదలను కన్నడంలో ఆగస్టు 14న నిర్వహించనున్నారు. మరి తెలుగు, తమిళ వెర్షన్స్‌లో ఎప్పుడూ చేస్తారో తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com