తమ్ముడి గురించి టెన్షన్ పడ్డా..: నాగబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గొప్ప విజన్ ఉన్న నాయకులు చాలా అరుదుగా ఉంటారని.. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పు వచ్చిందని భవిష్యత్తులో కూడా మంచి మంచి మార్పులు మనం చూడబోతున్నామని మెగా బ్రదర్ నరసాపురం లోక్‌సభ అభ్యర్థి నాగేంద్ర బాబు జోస్యం చెప్పారు. మంగళవారం భీమవరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్‌లో నరసాపురం పార్లమెంటరీ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవి అంటే హోదా కాదు బాధ్యత అని చెప్పుకొచ్చారు.
అదే వైసీపీ, టీడీపీ అయితే..!
"ప్రతి ఒక్కరికి సేవకుడిలా పని చేయాలి. కులాలు, మతాలను పక్కన పెట్టి బాధ్యత గల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే మనస్తత్వం అందరిలో పెరగాలి. మా తమ్ముడు కళ్లు తిరిగి పడిపోయాడని తెలియగానే టెన్షన్ ఫీలయ్యాను. ప్రచారం కూడా సరిగా చేయలేకపోయాను. ఇలాంటి సంఘటనలు తెలుగుదేశం, వైసీపీ పార్టీ లీడర్లకు జరిగితే గొప్ప ప్రచార అస్త్రంగా వాడుకునే వారు. జనసేన మాత్రం అలా చేయలేదు. పెద్ద మార్పు తీసుకొచ్చేటప్పుడు నమ్మకం ఉండాలి. తప్పు చేస్తే ఎదురించే ధైర్యం ఉండాలి" అని నాగబాబు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments