close
Choose your channels

రేయ్.. ఫోన్ చేయ్ నీకు ఆన్సర్ చెబుతా.. నాగబాబు వార్నింగ్

Monday, February 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రేయ్.. ఫోన్ చేయ్ నీకు ఆన్సర్ చెబుతా.. నాగబాబు వార్నింగ్

అవును మీరు వింటున్నది నిజమే.. ఓ ఇంటర్వ్యూ వేదికగా జనసేనాని బ్రదర్ నాగబాబు.. వైసీపీ నేతకు వార్నింగ్ ఇచ్చారు. లైవ్‌‌లో ఆయన ఎందుకు వార్నింగ్ ఇచ్చారు..? ఎవరికి వార్నింగ్ ఇచ్చారు..? అసలేం జరిగిందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల వైసీపీలో కీలక పదవి పొందిన తర్వాత థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఏపీ ప్రధాన కార్యదర్శిగా పదవి వచ్చిన అనంతరం మరుసటి రోజు మీడియాతో మాట్లాడిన పృథ్వీ.. సీఎం చంద్రబాబుపై మొదలుకుని యామిని సాధినేని, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌ సోదరుడు నాగబాబు వరకు అందరి గురించి ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో నాగబాబు, వరుణ్ తేజ్‌‌.. జనసేనకు ఇచ్చిన ఫండ్ గురించి మాట్లాడారు పృథ్వీ. దీంతో చెలరేగిన వివాదం ఇద్దరి మధ్య మాటల యుద్ధం దాకా వెళ్లింది. అది కాస్త ఇంటర్వ్యూ వేదికగా వార్నింగ్‌‌లు ఇచ్చుకునే స్థాయికి వెళ్లింది.

అసలు పృథ్వీ ఏమన్నారు..!?

వైసీపీ ప్రధాన కార్యదర్శి పదవి పొందిన అనంతరం ఓ ఇంటర్వ్యూలో జనసేన ప్రస్తావనకు వచ్చింది. ఇటీవల నాగబాబు ఆయన కుమారుడు వరుణ్ తేజ్‌‌ భారీగా జనసేనకు ఫండ్ ఇచ్చారు కదా దానిపై మీ కామెంట్ ఏంటి..? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు సమాధానంగా ఆయన.. ‘ఎక్కడినుంచో తీసుకొచ్చిన డబ్బుని తన కొడుకు ఖాతాలో వేసి దానిని జనసేన పార్టీకి ఇచ్చారు’ అని పృథ్వీ వ్యాఖ్యానించాడు. దీంతో మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు పృథ్వీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్..

పృథ్వీ గురించి ఇంటర్వ్యూలో ప్రస్తావన రాగా.. "ఫండ్ గురించి పృథ్వీ కామెంట్ చేశాడా..? నిజంగా పృథ్వి అన్నాడా..? ఏయ్ పృథ్వీ రేపు ఫోన్ చేయరా.. ఈ ప్రశ్నకు నేను నీకే ఆన్సర్ ఇస్తాను. పృథ్వీ నీకే చెబుతున్నా.. రేప్పొద్దున్న ఫోన్ చెయ్.. రా .. నా నెంబర్ నీ దగ్గర ఉంది కదా’ అంటూ వేలు చూపించి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నాగబాబు.

అంత అవసరం నాకేంటి..!?

"ఎవడికి ప్రూవ్ చేసుకోవాలి.. నా అకౌంట్ నుంచి తీసి పాతిక లక్షలు ఇచ్చాను. మా అబ్బాయి ఖాతాలో నుంచి తీసి కోటి ఇచ్చాడు. కావాలంటే నా అకౌంట్ చెక్ చేసుకోండి. నేనేమీ బ్లాక్ మని ఇవ్వలేదు. మా తమ్ముడికి (పవన్ కల్యాణ్‌)ప్యూర్ అకౌంటెడ్ క్యాష్ ఇచ్చా దీన్ని కూడా విమర్శిస్తారా?’ అంటూ లైవ్‌‌లో నాగబాబు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. అనంతరం ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు బీప్ సౌండ్ (సైలెంట్) వేసుకోండి అని చెప్పి మరీ నాగబాబు బూతులు తిట్టడం గమనార్హం.

ఓ వైపు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ.. మరోవైపు నాగబాబు మాటలతో సోషల్ మీడియా వేదికగా వైసీపీ వర్సెస్ మెగాఫ్యాన్స్ ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. సో ఈ వివాదం ఇంకాస్త ముదిరే అవకాశం ఉంది. త్వరలోనే నాగబాబు వ్యాఖ్యలకు కౌంటర్‌‌గా పృథ్వీ మాట్లాడతారని సమాచారం. అయితే ఈ వ్యవహారం ఎప్పుడు ఫుల్‌‌స్టాప్ పడుతుందో వేచి చూడాల్సిందే మరి..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment