టీటీడీ ఆస్థులు అమ్మకం.. నాగబాబు ట్వీట్
- IndiaGlitz, [Monday,May 25 2020]
మెగాబ్రదర్ నాగబాబు లాక్డౌన్ వల్ల షూటింగ్స్‌కే పరిమితమయ్యారు. దీంతో ఈయన తన భావాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇటీవల నాథూరాం గాడ్సేకు అనుకూలంగా మాట్లాడిన ఆయనపై పోలీసు కేసు కూడా నమోదైంది. అంతే కాకుండా కరెన్సీపై గాంధీజీ ఫొటోను ఎందుకుండాలి? ఆయన బ్రతికుంటే కూడా అదే చెప్పేవారని కూడా ట్వీట్ పెట్టారు. తాజాగా మరో సెన్సేషనల్ ట్వీట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేయబోయే పనిని టార్గెట్ చేస్తూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఇతర ప్రాంతాల్లోని టీటీడీకి చెందిన 23 స్థలాలను అమ్మాలనుకుంటోంది. దీనిపై నాగబాబు ట్వీట్ చేశారు.
‘‘తిరుపతి వెంకటేశ్వర స్వామి కి సంబంధించిన ఆస్థులని కాపాడే బాధ్యత తిరుపతి పాలకమండలిది. అంతే కాని స్వామి వారి భూములను అమ్మే హక్కు మీకు లేదు..హిందువుల మనోభావలని దెబ్బ తీయకండి.నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాను’’ అన్నారు నాగబాబు. ఈయన చేస్తోన్న ట్వీట్స్‌పై జనసేన పార్టీ కూడా స్పందించింది. నాగబాబు చేస్తోన్న ట్వీట్స్ ఆయన వ్యక్తిగతమని, దానికి పార్టీకి సంబంధం లేదని పవన్‌కల్యాణ్ తెలిపారు.
తిరుపతి వెంకటేశ్వర స్వామి కి సంబంధించిన ఆస్థులని కాపాడే బాధ్యత తిరుపతి పాలకమండలిది. అంతే కాని స్వామి వారి భూములను అమ్మే హక్కు మీకు లేదు..హిందువుల మనోభావలని దెబ్బ తీయకండి.నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాను.
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 25, 2020