చంపేస్తారా? చంపేయండి.. చావడానికి రె‘ఢీ’!

  • IndiaGlitz, [Wednesday,March 06 2019]

టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేనిపై వైసీపీ, జనసేన కార్యకర్తలు కొందరు సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంతో రెండు వేర్వేరు కేసుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. ‘మై చానెల్ నా ఇష్టం’ వేదికగా ఆయన స్పందించారు. ఈ సందర్భంగా టీడీపీ సర్కార్.. సీఎం చంద్రబాబు ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్‌‌, ఏపీ పోలీసులపై కన్నెర్రజేశారు. ఈ వీడియోలో జనసేన కార్యకర్తలను చూపించారు. గుంటూరు అరండాల్ పేట పోలీస్ స్టేషన్‌కి తరలించి అక్కడ నుండి ఎస్పీ బంగ్లాకు తరలించారని అక్కడ వాళ్లను బాగా కొట్టి హింసించారని తనకు సమాచారం ఉందని.. వీడియో చూస్తే మీకే అర్థమవుతుందన్నారు. ఈ విషయం తనకు కాస్త లేటుగా తెలిసిందన్నారు.

పరువు నష్టం దావా వేయొచ్చు..!

సాధినేని యామిని అనే టీడీపీ మహిళా నాయకురాలు మీద జనసేన కార్యకర్తలు ట్రోల్ చేశారు. ట్రోల్ చేయడం అనేది తప్పేంకాదు. కాకపోతే నిజంగా బాధపెట్టేవిగా ఉంటే పరువునష్టం దావా వేయొచ్చు అది సుప్రీం చెప్పింది. అరెస్ట్‌ చేయకూడదని కోర్టులు చెబుతున్నాయి. ఒకసారి అరెస్ట్‌ చేసి మళ్లీ మళ్లీ స్టేషన్‌ల చుట్టూ తిప్పుతున్నారు. ఇలా చేయడం ద్వారా జనసేన కార్యకర్తల మనస్తైర్యాన్ని దెబ్బకొడుతున్నట్టు భ్రమ పడుతున్నారు తెలుగు దేశం పార్టీ. దీనికి మీ అబ్బాయి లోకేష్, పార్టీ హెడ్‌గా చంద్రబాబు, ఏపీ హోం మినిష్టర్ చినరాజప్ప బాధ్యత వహించాలి అని నాగబాబు చెప్పుకొచ్చారు.

నేనే రంగంలోకి దిగుతా..!

ఎందుకంటే వాళ్లు ఏమైనా మర్డర్లు చేశారు, దేశ ద్రోహం చేశారా? టెర్రరిస్టులా.. మానభంగాలు చేశారా.. ఎందుకంతగా రియాక్ట్ అవుతున్నారు. అధికారంలో ఉన్న మీ నాయకురాలిని ఒక్కమాట అంటే ఇంత దారణంగా వ్యవహరిస్తారా? మీరు మా జనసేన కార్యకర్తల్ని ఎన్నిమాటలు అంటున్నారు. ఎన్నిరకాలుగా హించిస్తున్నారు. దోషుల్ని శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. అరెస్ట్ చేయడం వరకే మీ పని. థర్డ్ డిగ్రీ ప్రయోగించి రక్తాలు కారేలా కొట్టడమా. సాధినేని యామిని వీళ్ల దగ్గరకు వచ్చి ఆమె కూడా కొట్టినట్టు తెలుస్తోంది. మీ అరాచకాలు ఇంత దారుణంగా ఉన్నాయి. మీకు కాలం దగ్గర పడింది. వచ్చే ఎన్నికలే మీకు సరైన సమాధానం చెబుతాయి. ఇంకోసారి ఇలాంటి రిపీట్ అయితే మాత్రం నేనే నేరుగా రంగంలోకి దిగుతాను.. నేను ఓన్లీ ఆన్ లైన్ వారియర్ మాత్రమే కాదు. నాకు బయటకు వచ్చి పోరాడే శక్తి ఉంది. నాకు వయసు ఉంది. భయం లేదు. ఇకపై ఎవరైనా జనసేనను భయపెట్టాలని ప్రయత్నిస్తే.. నేను ప్రత్యక్షంగా వచ్చి కూర్చుంటా. వాళ్ల కోసం పోరాడతా. మీరు నన్ను కొట్టినా చంపేసినా నేను రెడీ అని నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చావడానికి నేను రెడీ..!

రండి.. చంపేస్తారా? వచ్చి చంపేయండి. ఒక మంచిపని కోసం చచ్చిపోవడానికి రెడీ.. కానీ మీలాగా అధికారం చేతిలో ఉంది కదా అడ్డదారిలో వెళ్లం.. జనసైనికులు మీ పార్టీని ఎదుర్కొంటారు. వాళ్ల వెనుక నేను ఉన్నాను. బీకేర్ ఫుల్.. ఏదైనా న్యాయంగా పోరాడదాం. రాబోయే ఎలక్షన్స్‌లో మీరు గెలిచినా.. మేం గెలిచినా.. జగన్ గెలిచినా.. న్యాయంగానే పోరాడదాం. అంతేకాని పగలు, ప్రతీకారాలు పెట్టుకుని.. ఇలా చేయడం దారుణం.

ఇదేనా న్యాయం ఇదేనా చట్టం.. సాధినేని యామినికి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పినట్టు పోలీస్‌లు కొడతారా? ఆమె పోలీస్‌ల ముందు జనసేన కార్యకర్తల్ని చెంపపై కొడుతుందా? ఒక వేళ చంపేయమంటే చంపేస్తారా? మేం కూడా ‘లా’ చదువుకున్నాం. దీన్ని పెద్ద ఇష్యూ చేయొచ్చు. కాని చేయదల్చుకోలేదు. మీరు మర్యాదగా ఆ బాధితుల్ని క్షమించమని కోరండి అని యామినేని సాధినేనికి నాగబాబు సూచించారు. ఈ వ్యవహారంపై తెలుగు తమ్ముళ్లు.. ముఖ్యంగా యామిని సాధినేని ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.

More News

కీలక నిర్ణయం: స్టీఫెన్ రవీంద్ర చేతికి ‘డేటా చోరీ’ కేసు

‘డేటా చోరీ’ కేసులో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువుర్ని విచారించిన సైబరాబాద్ పోలీసులు.. ‘ఐటీ గ్రిడ్’ డైరెక్టర్‌ లుక్ అవుట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

'సర్వం తాళ మయం' మార్చ్ 8 విడుదల

శంకరాభరణం, సాగర సంగమం వంటి అద్భుత సంగీత భరిత చిత్రాలను అందించిన కళాతపస్వి కె. విశ్వనాథ్ రాజీవ్ మీనన్ రూపొందించిన 'సర్వం తాళ మయం' చిత్రాన్ని

స‌మ్మ‌ర్‌లో భ‌య‌పెట్ట‌నున్న లారెన్స్‌

రాఘ‌వ లారెన్స్ న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ 'కాంచ‌న' సిరీస్‌. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు పార్టులు విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించాయి.

మహిళా దినొత్సవం సందర్బంగా  క‌థ‌నం టీజర్ విడుదల

ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం క‌థ‌నం. బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ‌చుక్కా ఈ చిత్రానికి నిర్మాత‌లు. రాజేష్‌నాదెండ్ల

'డేటా చోరీ' కేసులో కీలక వ్యక్తి.. ఆయన దొరికితే..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘డేటా చోరీ’ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో తెలియని పరిస్థితి.