నాగబాబు చెప్పింది నిజమే.. గాడ్సేపై సినిమా తీస్తా : ఆర్జీవీ
Send us your feedback to audioarticles@vaarta.com
జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా పేర్కొంటూ జనసేన పార్టీ నేత, సినీ నటుడు నాగబాబు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ గాడ్సే పుట్టిన రోజు కావడంతో నాగబాబు వరుస ట్వీట్స్ చేశారు. దీంతో నెటిజన్లు, జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు జనసేన కార్యకర్తలయితే దుమ్మెత్తి పోస్తున్నారు. వివాదాల కోసమే ఇలా చేస్తున్నారా..? లేకుంటే మీరు చేయాల్సిన పనులేమీ లేవని ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారా..? అని అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరోవైపు.. ఈ ట్వీట్‌తో సినీ, రాజకీయ వర్గాల్లో కొత్త చర్యలు మొదలయ్యాయి. కాగా.. నాగబాబు చేసిన వ్యాఖ్యలపై సొంత అభిమానులే తిట్టిపోస్తుండటం గమనార్హం.
ఎస్.. నేను సమర్థిస్తున్నా..!
నాగబాబు వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఓ చానెల్ డిబెట్లో భాగాంగా ఆయన మాట్లాడుతూ.. అవును నాగబాబు చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని.. నూటికి నూరు శాతమే నిజమేనని చెప్పుకొచ్చాడు. అంతేకాదు తాను ఎందుకు సమర్థిస్తున్నాను అనేదానిపై నిశితంగా వివరణ కూడా ఇచ్చుకున్నాడు.
గాడ్సేపై సినిమా తీస్తా..
‘గాడ్సే కోరుకున్నవి రెండూ నెరవేరినా గాంధీని ఎందుకు చంపాడనేది ఎవరికీ తెలియదు. తన జీవితంలో ఎప్పుడూ తుపాకి పట్టని గాడ్సే.. గాంధీని చంపడానికి పట్టుకున్నాడు. ఆయనపై ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు. త్వరలోనే గాడ్సేపై ఓ సినిమా చేస్తాను. ఇక దేవుడున్నాడని గుర్తు చేయడానికి.. అతన్ని మర్చిపోకుండా ఉండటానికే కరోనాను పంపించాడు’ అని ఆర్జీవీ సెటైర్ల వర్షం కురిపించారు. ప్రస్తుతం నాగబాబు, ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అంతేకాదు ఇదివరకు మెగా ఫ్యామిలీ అంటే అస్సలు పడని ఆర్జీవీ ఇప్పుడు కాస్త వత్తాసు పలికినట్లే చేస్తున్నాడని కామెంట్స్ కూడా నెటిజన్లు చేస్తున్నారు.
రాములమ్మ రియాక్షన్..
నాగబాబు వ్యాఖ్యలపై అలనాటి నాటి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి అలియాస్ రాములమ్మ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘‘కుల, మతాలు వేరైనా దైవం ఒక్కటే.. ఎన్ని తరాలైనా జాతిపితా ఒక్కడే.. 130 కోట్ల మంది భారతీయులకు మహత్ముడు ఒక్కడే. ఈశ్వర్, అల్లా... తేరానామ్... సబ్ కో సన్మతి దే భగవాన్. నాకు కూడా.. ‘అని’ గాడ్సే ఇప్పుడు బ్రతికుంటే.. ఈ జన్మదినం నాడు ఇదే ప్రార్ధించేవాడు.. మన్నించండి మహత్మా’’ అంటూ నాగబాబుపై పరోక్షంగా రాములమ్మ స్పందించారు. మొత్తానికి చూస్తే గాడ్సే పుట్టిన రోజున నాగబాబు ఇలా నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు, జనసేనకార్యకర్తలు, రాజకీయ నేతల చేతిలో అడ్డంగా బుక్కయ్యారన్న మాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout