జబర్దస్త్‌లో ఇక నేను కనిపించను.. నాగబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాబ్రదర్ నాగబాబు ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. అయితే తప్పుకోవడంపై ఇప్పటికే పలు రకాలుగా వార్తలు వినవచ్చాయి. మరీ ముఖ్యంగా బాండ్ పిరియడ్ విషయంలో తేడా కొట్టిందని.. రెమ్యునరేషన్ విషయంలో యాజమాన్యానికి నాగబాబుకు గొడవ జరిగిందని కూడా పుకార్లు వచ్చాయి. అయితే రోజురోజుకు పుకార్లు మరిన్ని పుడుతుండటంతో ఎట్టకేలకు ఈ వ్యవహారంపై తన యూ ట్యూబ్ చానెల్.. ‘మై చానెల్ నా ఇష్టం’ వేదికగా రియాక్ట్ అయ్యారు.
ఇదీ అసలు కథ..!
‘జబర్దస్త్‌లో నవంబర్-21, 22 తారీఖుల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్‌లే నాకు చివరివి. ఇక నేను జబర్దస్త్‌లో కనిపించను. నాది ఏడున్నరేళ్ల ప్రయాణం. 2013 ఫిబ్రవరి నుంచి కొనసాగింది. నేను జబర్దస్త్ నుంచి తప్పుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని వదంతులు వస్తున్నాయి. అందుకే క్లారిటీ ఇస్తున్నాను. బిజినెస్ పరంగా ఐడియాలజీ వల్లే తప్పుకొన్నా. అందుకే బయటకు వచ్చాను. నాకు ఎంతగానో సహకరించిన శ్యాంప్రసాద్ రెడ్డికి, ఈ టీవీకి నాగబాబు కృతజ్ఞతలు. నాకు నేనుగా మానేసే పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు.. అనుకోలేదు కూడా. కానీ.. ఏదైనా ప్రోగ్రాం లేదా ప్రయాణం ఎక్కడో ఓచోట ముగియాలి. అయితే, ప్రోగ్రాం కంటే ముందే జబర్దస్త్‌తో నా జర్నీ ముగుస్తుంది. నా స్థాయికి తగ్గట్టు కాకపోయినా మంచి పారితోషికమే ఇచ్చారు. ఆ డబ్బు నాకు చాలా ఉపయోగపడింది. పారితోషికం వల్లే జబర్దస్త్‌ను వదిలేస్తున్నానని వస్తున్న వార్తలు నిజం కాదు. ఇన్ని రోజులూ ఎంతో సరదాగా ఈ షో నడిచింది. ఈ కార్యక్రమం గురించి నేను ఏనాడూ, ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు. వివాదాలు కోరుకోలేదు. జబర్దస్త్‌లో నా ప్రయాణం ఎలా మొదలైంది.. ఎలా పూర్తయింది అనేది త్వరలో వెల్లడిస్తాను’ అని నాగబాబు తన యూట్యూబ్ వీడియోలో చెప్పుకొచ్చారు.
మరి నాగబాబు వ్యాఖ్యలపై మేఘమాల, ఈటీవీ యాజమాన్యం ఎలా రియాక్ట్ అవుతుందో..? మున్ముంథు నాగబాబు ఈ షోకు సంబంధించి ఏయే విషయాలు బయటపెడతారో మరి. ఇదిలా ఉంటే.. జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పిన నాగబాబు జీ టీవీలో ప్రసారమైన ఓ ప్రోమోలో ప్రత్యక్షమయ్యారు. మరి ఈ షోకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments