‘వకీల్ సాబ్’ను అడ్డుకునే వ్యక్తి కాదు జగన్: నాగబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రమే కాదు జనసేన అధినేత కూడా. అయితే ఆయన రాజకీయాల్లో నెగ్గుకురావాలంటే రిసోర్సెస్ కావాలని.. దానికోసం మళ్లీ సినిమాలు చేస్తున్నాడని మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించారు. పవన్ సినిమాలు వదిలేసి.. డబ్బు లేకపోవడంతో తను ఎకనామికల్‌గా వీక్ అవుతున్నాడేమోనని భయం వేసిందని ఆయన యూట్యూబ్ వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలో ‘వకీల్ సాబ్’ చేశాడన్నారు. థియేటర్‌లో తాను ‘వకీల్ సాబ్’ చూశానని.. నిజానికి తానొక లాయర్‌నని.. ప్రాక్టీస్ చెయ్యలేదు కానీ మద్రాస్ బార్ కౌన్సిల్‌లో తను లాయర్‌గా తన పేరును రిజిస్టర్ చేసుకున్నానన్నారు. ఎథికల్ వ్యాల్యూస్, ప్రజల కోసం నిలబడే ఒక లాయర్ పాత్రను కల్యాణ్ బాబు చేయడం చాలా ఆనందంగా అనిపించిందన్నారు. ఈ సినిమాలోని క్యారెక్టర్ నిజ జీవితంలో ఎలా ఉంటాడో అలానే ఉందని నాగబాబు తెలిపారు.
సినిమాలో ఎక్కడా ఎవరూ కూడా ఓవర్ చెయ్యలేదన్నారు. రెగ్యులర్ సినిమాలు చూడటం మానేశానని.. కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చూస్తున్నానని నాగబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉంటుందోనని థియేటర్‌కు వెళ్లానన్నారు. ‘వకీల్ సాబ్’ చూశాక మంచి సినిమా చూశానన్న తృప్తి లభించిందన్నారు. ఇక సినిమాల రేట్ల విషయమై నాగబాబు మాట్లాడుతూ.. భారీ బడ్జెట్ సినిమాలు తీసినప్పుడు రెండు, మూడు రోజుల పాటు రేట్లు పెంచాలన్నారు. అభిమానులకు నచ్చేలా సినిమా చేయాలంటే కొంత బడ్జెట్‌పై దృష్టి పెట్టక తప్పదన్నారు. మరి అంత ఖర్చు పెట్టి సినిమా తీసినప్పుడు రెండు, మూడు రోజుల పాటు టికెట్ రేట్లు పెంచక తప్పదని నాగబాబు పేర్కొన్నారు.
ఇక సీఎం జగన్.. ‘వకీల్ సాబ్’ సినిమాకు టికెట్ ధరలు పెంచకుండా అడ్డుకున్నారంటూ వస్తున్న వార్తలపై నాగబాబు స్పందించారు. ‘‘నాకు తెలిసి సీఎం జగన్ అలాంటి వ్యక్తి కాదు. ఆయనకు బిగ్గర్ బ్యాటిల్స్ ఉన్నాయి. కల్యాణ్ బాబు, బీజేపీ, చంద్రబాబుగారు ఎవరితో ఫైట్ చేయాలన్న ఆయనకు బిగ్గర్ బ్యాటిల్స్ ఉన్నాయి. ఒక సినిమాను ఇలా చేయాలన్న ఆలోచన కచ్చితంగా రాదని నా నమ్మకం. కింది స్థాయి అంటే లోకల్‌గా ఉండే నేతలు వీళ్లు చేసిన పనులే అవి. అక్కడక్కడా షోస్ ఆపేయడం వంటివి చేశారు. పొలిటికల్‌గా మీరు ఎన్ని మాటలైనా అనండి. కానీ సినిమాపై కొన్ని వేల మంది ఆధారపడి ఉంటారు. కల్యాణ్ బాబుపై కోపంతో మీరు చేసే పనుల కారణంగా వాళ్లు సఫర్ అవుతారు. కొంత సీగ్రేడ్ థింకింగ్ ఉన్నావాళ్లున్నారు. జగన్ స్పందిస్తారేమో అనుకున్నా. కానీ ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. సినిమాలు ఆపేయాలనుకునే క్యారెక్టర్ కాదు జగన్‌ది’’ అని నాగబాబు పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments