బాలయ్య కామెంట్ 2 ...నాగబాబు రిప్లై..
Send us your feedback to audioarticles@vaarta.com
పవన్‌కల్యాణ్‌ను విమర్శించిన బాలకృష్ణ ఆరు సందర్భాల్లో తక్కువ చేస్తూ మాట్లాడరన్న నాగబాబు. దానికి సంబంధించిన రెండో కామెంట్ వీడియో విడుదల చేశారు. గతంలో బాలయ్య ఒకరిని హీరోలనడం ఏంటి? మేమే సూపర్‌స్టార్స్ అని అన్నారు.
దీని పై నాగబాబు స్పందిస్తూ.. "మేం కూడా కౌంటర్ చేసేవాళ్లమని అయితే ఎందుకని ఆగాం. సదరు చానెల్ మిమ్మల్ని పవన్‌కల్యాణ్ గురించి అడిగినప్పుడు అతను తప్పుగా మాట్లాడాడని చెప్పండి.. లేదా విమర్శించండి. అంతే కానీ.. మాకు మేమే సూపర్‌స్టార్లం అనడం ఎంత వరకు కరెక్ట్.
అలా అనడం ఏంటి? . మీరు సూపర్స్టార్సే అబ్జక్షన్ లేదు. కానీ మిగతావాళ్లు కాదా!. ఇండస్ట్రీలో మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్, పవన్‌కల్యాణ్ వంటి స్టార్స్ ఉన్నారు. మీరెవరినీ హీరోలు చేయలేదు. జనాలకు నచ్చితే హీరోలయ్యారు. స్టార్స్ అయ్యారు" అంటూ నాగబాబు మాట్లాడారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout