బాలయ్య కామెంట్ 5 .. నాగబాబు కౌంటర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎ.బి.ఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కామెంట్‌ను ఐదో కామెంట్‌గా చూపెడుతూ ఓ మీటింగ్ సమయం కావడంతో తలా తోకా లేని పార్టీలు పుట్టుకొచ్చి అలాగా బలగా జనాన్ని వెంటేసుకొని తిరుగుతున్న పార్టీలను మనం ఇప్పుడు చూస్తున్నామంటూ బాలయ్య చెప్పారు. దీనిపై నాగబాబు మాట్లాడుతూ ``మీ తెలుగు దేశాన్ని మెచ్చుకన్నారు. వై.ఎస్.ఆర్ జగన్ పార్టీని డైరెక్ట్‌గా విమర్శించారు. కానీ ఇక్కడ మీరు ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడారు. సంకరజాతి పార్టీలు పుట్టుకొచ్చాయి. అలగా బలగా జనాన్ని వెంటేసుకొచ్చాయని ఏదో సామెత చెప్పారు. సామెత అర్థం కాలేదు.
అయితే ఇతర కులాలు, జాతుల మీద మీకు గౌరవం లేదు. ఎటకారం మీకు. ఎంటీ అంత ఎటకారం. ఉదాహరణకు జనసేన పార్టీనే అన్నారనుకుందాం. ఎందుకంటే మా తమ్ముడు మీకు వ్యతిరేకంగా మాట్లాడాడు. మాట్లాడినందుకు రాజకీయంగా అతన్ని ఏమైనా విమర్శించొచ్చు. నాకేం అబ్జక్షన్ లేదు. కానీ జనసేన పార్టీలో తిరిగే వ్యక్తుల్లో ఎస్సీలు, ఎస్టీలు, వెనకబడిన కులాలు, కాపు వర్గీయులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, కమ్మవారు, రెడ్డీస్, వైశ్యులు .. చాలా కమ్యూనిటీస్ పనిచేస్తున్నాయి. ఏ పార్టీలో అయినా ఇవే కమ్యూనిటీస్ ఉంటాయి.
మీ తెలుగు దేశంలోనూ అవే కమ్యూనిటీస్ ఉంటాయి.. వైఎస్ఆర్‌లోనూ అవే కమ్యూనిటీస్ ఉంటాయి. విమర్శించాల్సింది పార్టీ పాలసీలనే కానీ.. వ్యక్తులను కాదు. ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారో మీకెవరూ చెప్పలేదా? ఎంతో మంది ప్రజల మనోభావాలు దీని వల్ల దెబ్బతిన్నాయి. ఈ రాజకీయాల్లో ఎందుకు తలదూర్చడం అని నేను బాధపడినా ఊరుకున్నాను`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments