'జార్జ్‌రెడ్డి'.. పవన్, వరుణ్‌తో తీద్దామనుకున్నా కానీ...!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో వరస పెట్టి బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బయోపిక్‌లకే ఇప్పుడు ట్రెండ్ నడుస్తోంది కూడా. ఇప్పటికే పలు బయోపిక్‌లు వచ్చి వెళ్లిపోగా.. మరికొన్ని బాక్సాఫీస్‌ను షేక్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే.. తాజాగా మరో బయోపిక్ తెలుగులో వస్తోంది. స్టూడెంట్ పాలిటిక్స్ గురించి తెలిసిన వారందరికీ జార్జిరెడ్డి పేరు తెలుసు. ఉస్మానియాలో ఒకప్పుడు జార్జి రెడ్డి ఒక సంచలనం. ఆయన జీవితం స్ఫూర్తితోనే గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం.. తన "యువ" సినిమాలో సూర్య పాత్రని తీర్చిదిద్దారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో బయోపిక్ రూపొందుతోంది. కాగా ఇప్పటికే ఈ చిత్రంపై మంచి టాక్ రాగా.. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు యూ ట్యూబ్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
పవన్ లేదా అబ్బాయ్ అనుకున్నా!
జార్జిరెడ్డి పోస్టర్లు చూసిన తర్వాత ట్రైలర్‌ను చూశా.. చాలా బాగుందని నాగబాబు కితాబిచ్చారు. చాలా ఏళ్లుగా ఆయన గురించి వింటూనే ఉన్నా.. ఆయన పాత్రను తమ్ముడు కల్యాణ్ బాబు లేదా అబ్బాయి వరుణ్‌తో చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచించినట్లు తన మనసులోని మాటను బయటపెట్టారు. అంతటితో ఆగని ఆయన.. తాను ఇలా అనుకుంటున్న టైమ్‌లో జీవన్ రెడ్డి ఆ కథతో సినిమా తీసేశారని సంతోషించానన్నారు. అయితే ట్రైలర్ పూర్తిగా చూసిన తర్వాత అలాంటి పాత్రకు పేరున్న నటుడు అంతగా సరిపోడని తనకు అనిపించిందన్నారు.
పవనే గుర్తొస్తాడు!
‘సందీప్ మాధవ్ ఇప్పటివరకు చిన్న పాత్రలే చేశాడు. అతను జార్జిరెడ్డి పాత్రకు సరిపోయాడు. జార్జిరెడ్డి ఒక దిగ్గజ విద్యార్థి. అందుకే ఆయనింటే నాకు ఇష్టం. ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్. ఇస్రోలో ఉద్యోగం వస్తే చేరలేదట. విద్యార్థుల సమస్యల పరిష్కారంకోసం ఆయన వాటిని వదులుకున్నాడు. జార్జి రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ.. ఆయన మేధావి మాత్రమే కాదు, రియల్ హీరో, రియల్ లైఫ్ బాక్సర్. అనేక విద్యల్లో ప్రావీణ్యం ఉంది. జార్జిరెడ్డి ఫొటోలను చూస్తుంటే మా పవనే గుర్తుకొస్తాడు. ఆయన వ్యక్తిత్వం, భావోద్వేగాలు పవన్‌లో కనిపిస్తాయి. జార్జిరెడ్డి జెండాలో పిడికిలి గుర్తు, జనసేన జెండాలో ఉండటం యాదృచ్ఛికం’ అని నాగబాబు చెప్పుకొచ్చారు. కాగా జార్జ్‌రెడ్డి చిత్రం 22న థియేటర్లలోకి రానుంది. మరి జార్జ్‌రెడ్డి ఎలా ఉంటుందో...? ఏ మాత్రం హిట్టవుతుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout