Nagababu:బిగెస్ట్ డెవిల్స్‌తో యుద్ధం చేస్తున్నాం.. కలిసి పోరాడి వైసీపీని గద్దె దించుద్దాం: నాగబాబు

  • IndiaGlitz, [Thursday,October 12 2023]

బిగెస్ట్ డెవిల్స్‌తో మనం యుద్ధం చేస్తు్న్నామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు తెలిపారు. కలిసికట్టుగా పోరాటం చేయకపోతే వైసీపీని గద్దె దించలేమని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా నాయకులతో జూమ్ సమావేశంలో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ ప్రభుత్వ అవినీతి వల్ల సామాన్య ప్రజలు నలిగిపోతున్నారని.. దోపిడియే పరమాధిగా పాలన సాగుతుందన్నారు. ప్రకృతి వనరులైన ఇసుక, మట్టి వంటి వాటిని దోచుకుని వైసీపీ నాయకులు కోట్లకు పడగెలెత్తుతున్నారని ఆరోపించారు.

కేసులకు భయపడకండి.. మీ వెనక మేమున్నాం..

వైసీపీ అధినేత జగన్ నుంచి కార్యకర్త వరకు అందరూ దెయ్యం పట్టినట్లు ఊగిపోతున్నారని ఎద్దేవా చేశారు. అవినీతిని ప్రశ్నించినా, దోపిడీని అడ్డుకున్నా అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల బెదిరింపులకు కార్యకర్తలెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మీ వెనక మేమున్నామని.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తేనే భవిష్యత్తులో నాయకులుగా ఎదుగుతారని తెలిపారు. తిరుమలలో చిరుత దాడిలో చిన్నారి దుర్మరణం పొందితే నెల్లూరు జిల్లాకు చెందిన కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తల్లిదండ్రులపై అనుమానం ఉందని వ్యాఖ్యానించడం చూస్తుంటే వారి మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఇలాంటి నాయకులున్న ప్రభుత్వం నుంచి న్యాయం ఆశించడం కూడా అత్యాశే అవుతుందన్నారు.

పొత్తు స్ఫూర్తి దెబ్బ తినేలా ఎవరూ మాట్లాడొద్దు..

వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం వైసీపీ నాయకులు ఎలాంటి కుట్రలైనా చేస్తారని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో 26లక్షల దొంగ ఓట్లు బయటపడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ కొత్త ఓట్లను నమోదు చేయించడంతో పాటు మీ ఓట్లు ఉన్నాయా లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నారు. ఏ పార్టీలో అయినా భిన్న అభిప్రాయలు సహజమని.. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. పొత్తులో భాగంగా ఎవరికి సీటు వచ్చినా మిగిలిన వారు సహకరించాలని కోరారు. అంతే తప్ప పొత్తు స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రవర్తించవద్దని నాగబాబు విజ్ఞప్తి చేశారు.

More News

Chandrababu:టీడీపీ చీఫ్ చంద్రబాబుకు మరోసారి నిరాశే.. స్కిల్ కేసులో బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.

Jagananna Colony: రాష్ట్రానికి గృహ శోభ.. అక్కాచెల్లెమ్మలకు అన్నగా అండగా సీఎం వైయస్ జగన్

రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలబడ్డారు. ప్రతి చెల్లీ, ప్రతి అక్కా సొంత ఇంట్లో ఆత్మగౌరవంతో జీవించాలని ఆయన సంకల్పించారు.

Bigg Boss 7 Telugu : అశ్వినిని నలిపేసిన అమర్‌దీప్ .. ప్రశాంత్ కెప్టెన్సీ గోవిందా, రైతుబిడ్డ కంటతడి

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో సందడి పెరిగింది.

Lokesh:రెండో రోజు ముగిసిన సీఐడీ విచారణ.. సమయం వృథా చేశారని లోకేశ్ ఆగ్రహం

తాడేపల్లి సీఐడీ కార్యాలయంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండో రోజు విచారణ ముగిసింది.

Rajasthan Election:రాజస్థాన్ ఎన్నికల పోలింగ్ తేది మార్పు.. ఎందుకంటే..?

ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే.