Nagababu:బిగెస్ట్ డెవిల్స్‌తో యుద్ధం చేస్తున్నాం.. కలిసి పోరాడి వైసీపీని గద్దె దించుద్దాం: నాగబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
బిగెస్ట్ డెవిల్స్‌తో మనం యుద్ధం చేస్తు్న్నామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు తెలిపారు. కలిసికట్టుగా పోరాటం చేయకపోతే వైసీపీని గద్దె దించలేమని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా నాయకులతో జూమ్ సమావేశంలో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ ప్రభుత్వ అవినీతి వల్ల సామాన్య ప్రజలు నలిగిపోతున్నారని.. దోపిడియే పరమాధిగా పాలన సాగుతుందన్నారు. ప్రకృతి వనరులైన ఇసుక, మట్టి వంటి వాటిని దోచుకుని వైసీపీ నాయకులు కోట్లకు పడగెలెత్తుతున్నారని ఆరోపించారు.
కేసులకు భయపడకండి.. మీ వెనక మేమున్నాం..
వైసీపీ అధినేత జగన్ నుంచి కార్యకర్త వరకు అందరూ దెయ్యం పట్టినట్లు ఊగిపోతున్నారని ఎద్దేవా చేశారు. అవినీతిని ప్రశ్నించినా, దోపిడీని అడ్డుకున్నా అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల బెదిరింపులకు కార్యకర్తలెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మీ వెనక మేమున్నామని.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తేనే భవిష్యత్తులో నాయకులుగా ఎదుగుతారని తెలిపారు. తిరుమలలో చిరుత దాడిలో చిన్నారి దుర్మరణం పొందితే నెల్లూరు జిల్లాకు చెందిన కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తల్లిదండ్రులపై అనుమానం ఉందని వ్యాఖ్యానించడం చూస్తుంటే వారి మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఇలాంటి నాయకులున్న ప్రభుత్వం నుంచి న్యాయం ఆశించడం కూడా అత్యాశే అవుతుందన్నారు.
పొత్తు స్ఫూర్తి దెబ్బ తినేలా ఎవరూ మాట్లాడొద్దు..
వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం వైసీపీ నాయకులు ఎలాంటి కుట్రలైనా చేస్తారని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో 26లక్షల దొంగ ఓట్లు బయటపడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ కొత్త ఓట్లను నమోదు చేయించడంతో పాటు మీ ఓట్లు ఉన్నాయా లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నారు. ఏ పార్టీలో అయినా భిన్న అభిప్రాయలు సహజమని.. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. పొత్తులో భాగంగా ఎవరికి సీటు వచ్చినా మిగిలిన వారు సహకరించాలని కోరారు. అంతే తప్ప పొత్తు స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రవర్తించవద్దని నాగబాబు విజ్ఞప్తి చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com