వరుణ్‌కి సాయిపల్లవితో పెళ్లి.. నాగబాబు ఫన్నీ రిప్లై
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ మధ్య మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు. అభిమానులతో తరచూ టచ్‌లో ఉంటూ వారు అడిగే సిల్లీ క్వశ్చన్స్‌కి ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా అంతకు మించి సిల్లీగా ఆన్సర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. దీంతో నాగబాబుపై అభిమానులు రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇటీవల ఓ నెటిజన్.. నాగబాబును రెండో పెళ్లి చేసుకుంటారా? అని అడిగిన విషయం తెలిసిందే. మీకు ఇష్టమైతే ఓకే అంటూ నాగబాబు కూడా చాలా కూల్‌గా కొంటెగా ఆన్సర్ చేసి ఆకట్టుకున్నారు.
ఇక నాగబాబుకు నెటిజన్ల నుంచి ఎదురయ్యే ప్రశ్నల్లో కామన్‌గా ఉండే ప్రశ్న.. వరుణ్ తేజ్ పెళ్లి. మెగా డాటర్ నిహారిక పెళ్లి తర్వాత మెగాభిమానులకు నెక్ట్స్ లైన్లో వరుణ్ తేజ్ మాత్రమే కనిపిస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు నాగబాబును నెటిజన్లు ఈ ప్రశ్నను అడిగిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఓ నెటిజన్.. వరుణ్‌కి వధువుని వెదికి మరీ ఆమెతో వివాహం జరిపించవచ్చు కదా అని ప్రశ్నించాడు. ఆ వధువు మరెవరో కాదు స్టార్ హీరోయిన్ సాయిపల్లవి. అయితే ఆ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నాగబాబు ఇచ్చిన రిప్లై ఇప్పుడు అభిమానులను తెగా ఆకట్టుకుంటోంది.
ఇటీవల నాగబాబు ఇన్‌స్ట్రాగ్రామ్ లైవ్‌లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘వరుణ్ అన్నా సాయి పల్లవికి మ్యారేజ్ చేస్తా సార్.. జోడీ బాగుంటుంది' అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. నెటిజన్ ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా నాగబాబు జాతిరత్నాలు సినిమాలోని క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు సీన్ వీడియోను పోస్ట్ చేసి షాకిచ్చారు. ఆ కోర్ట్ సీన్లో జడ్జ్‌గా ఉన్న బ్రహ్మానందం 'తీర్పు మీరు మీరు చెప్పుకోండ్రా. ఇక, నేనేందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోతాలే' అనే డైలాగ్ చెబుతారు. ఇదే వీడియో నాగబాబు పోస్ట్ చేశారు. నాగబాబు ఫన్నీ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com