'సాయిరెడ్డీ.. గొంతుకు కాదు.. ముక్కుకు మాస్క్ పెట్టుకోండి!'
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి కాటేస్తున్న నేపథ్యంలోనూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయాలు ఆగట్లేదు. తమ వంతు సాయం చేసి పేదలను.. కరోనా బాధితులను ఆదుకోవాల్సిన నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇందులో ఏ పార్టీకి చెందిన వారూ తక్కువ కాదు. ఈ టైమ్‌లో ఇలాంటివి అవసరమా..? లేదా..? అనేది కాస్త కూడా ఆలోచించకుండానే నోటికొచ్చినట్లు తిట్టేయడం.. సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం ట్వీట్స్, పోస్ట్‌లు చేయడం బూతులు తిట్టేసుకుంటున్నారు. అయితే.. వీరందరిలో ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి.. మెగా బ్రదర్, నటుడు, జనసేన నేత నాగబాబుల మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. ఒకరేమో విమర్శిస్తూ ట్వీట్ చేస్తే దానికి స్పందించి మరీ కౌంటర్ ఎటాక్ చేస్తూ ఇంకొకరు ట్వీట్ చేస్తూ దుమారం రేపుతున్నారు. అసలు వీరిద్దరి మధ్య జరిగిన వార్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఫ్యూచర్‌లో ఫైట్ చేసుకోవాలిగా!
కరోనా నేపథ్యంలో విశాఖలో ప్రగతి భారతీ ట్రస్ట్ ద్వారా పెద్దఎత్తున విజయసాయి నిత్యావసరాలు పంచుతున్నారు. అయితే ఈ కార్యక్రమాల్లో ఎక్కువగా విజయసాయి నోటికి కాకుండా.. గొంతుకే మాస్క్ ధరించారు. దీనిపై విమర్శలు గుప్పిస్తూ.. అలా కాదు.. ఇలా చేయండి అని ట్విట్టర్ వేదికగా నాగబాబు సలహాలు ఇచ్చారు. ‘విజయ సాయి రెడ్డీ.. మాస్క్ ముక్కు, నోటికి పెట్టుకోండి. గొంతుకి కాదు. ఒక వేళ మీరు అసిమ్టోమేటిక్ అయినా ప్రాబ్లెమ్ ఉండదు. మీ సెక్యురిటి కూడా మాస్క్ లు పెట్టుకున్నారు. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఫ్యూచర్‌లో ఫైట్ చేసుకోవాలిగా మీతో.. మీకు మాస్క్ ఉన్నా జనం గుర్తు పడతారు. నేను గ్యారంటీ’ అని నాగబాబు ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఇందుకు సంబంధించిన పిక్‌ను కూడా ట్వీట్‌కు జతచేశాడు. దీంతో మరోసారి సోషల్ మీడియా వేదికగా జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు వర్సెస్ వైసీపీ కార్యకర్తలుగా పరస్థితులు మారిపోయాయ్. మరి దీనిపై విజయసాయి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments