'సాయిరెడ్డీ.. గొంతుకు కాదు.. ముక్కుకు మాస్క్ పెట్టుకోండి!'

కరోనా మహమ్మారి కాటేస్తున్న నేపథ్యంలోనూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయాలు ఆగట్లేదు. తమ వంతు సాయం చేసి పేదలను.. కరోనా బాధితులను ఆదుకోవాల్సిన నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇందులో ఏ పార్టీకి చెందిన వారూ తక్కువ కాదు. ఈ టైమ్‌లో ఇలాంటివి అవసరమా..? లేదా..? అనేది కాస్త కూడా ఆలోచించకుండానే నోటికొచ్చినట్లు తిట్టేయడం.. సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం ట్వీట్స్, పోస్ట్‌లు చేయడం బూతులు తిట్టేసుకుంటున్నారు. అయితే.. వీరందరిలో ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి.. మెగా బ్రదర్, నటుడు, జనసేన నేత నాగబాబుల మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. ఒకరేమో విమర్శిస్తూ ట్వీట్ చేస్తే దానికి స్పందించి మరీ కౌంటర్ ఎటాక్ చేస్తూ ఇంకొకరు ట్వీట్ చేస్తూ దుమారం రేపుతున్నారు. అసలు వీరిద్దరి మధ్య జరిగిన వార్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఫ్యూచర్‌లో ఫైట్ చేసుకోవాలిగా!

కరోనా నేపథ్యంలో విశాఖలో ప్రగతి భారతీ ట్రస్ట్ ద్వారా పెద్దఎత్తున విజయసాయి నిత్యావసరాలు పంచుతున్నారు. అయితే ఈ కార్యక్రమాల్లో ఎక్కువగా విజయసాయి నోటికి కాకుండా.. గొంతుకే మాస్క్ ధరించారు. దీనిపై విమర్శలు గుప్పిస్తూ.. అలా కాదు.. ఇలా చేయండి అని ట్విట్టర్ వేదికగా నాగబాబు సలహాలు ఇచ్చారు. ‘విజయ సాయి రెడ్డీ.. మాస్క్ ముక్కు, నోటికి పెట్టుకోండి. గొంతుకి కాదు. ఒక వేళ మీరు అసిమ్టోమేటిక్ అయినా ప్రాబ్లెమ్ ఉండదు. మీ సెక్యురిటి కూడా మాస్క్ లు పెట్టుకున్నారు. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఫ్యూచర్‌లో ఫైట్ చేసుకోవాలిగా మీతో.. మీకు మాస్క్ ఉన్నా జనం గుర్తు పడతారు. నేను గ్యారంటీ’ అని నాగబాబు ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఇందుకు సంబంధించిన పిక్‌ను కూడా ట్వీట్‌కు జతచేశాడు. దీంతో మరోసారి సోషల్ మీడియా వేదికగా జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు వర్సెస్ వైసీపీ కార్యకర్తలుగా పరస్థితులు మారిపోయాయ్. మరి దీనిపై విజయసాయి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

More News

అర్నబ్‌ గోస్వామిపై దాడి వెనుక అసలేం జరిగింది.. ఎందుకిలా..!?

రిపబ్లికన్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై బుధవారం అర్థరాత్రి దాడి జరిగింది. ముంబైలోని టీవీ చానెల్ స్టూడియో నుంచి తన భార్యతో కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు

తార‌క్ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన చిరు, వెంకీ

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న ఛాలెంజ్ ‘బీ ద రియ‌ల్ మేన్‌’. క‌రోనా దెబ్బ‌కు దేశ‌మంత‌టా లాక్ డౌన్ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో సినీ సెల‌బ్రిటీలంద‌రూ డిఫ‌రెంట్

స‌మంత ఈజ్ బ్యాక్‌

స‌మంత అక్కినేనికి ఏమైంది? అని చాలా రోజులుగా ఆమె అభిమానుల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న‌. సాధార‌ణంగానే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స‌మంత.. ఇప్ప‌డు కామ్ అయిపోయారు.

క్రియేటివిటీని పీక్స్‌లో చూపిస్తున్న పాయ‌ల్‌

హాట్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ లాక్‌డౌన్ వ‌ల్ల వ‌చ్చిన క్వారంటైన్ టైమ్‌ను డిఫ‌రెంట్‌గా వాడుకుంటుంది. ఇంటిప‌నులు చేసుకుంటున్నాన‌ని

కిమ్.. మీరు బాగుండాలి.. : ట్రంప్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ (36)కు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.