రాజ్యసభకు చిరు.. క్లారిటీ ఇచ్చేసిన నాగబాబు!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవికి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంపరాఫర్ ఇవ్వాలని భావిస్తు్న్నాడని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే మెగాస్టార్‌ను పెద్దలసభ (రాజ్యసభ)కు పంపాలని సీఎం అనుకుంటున్నారని గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయ్. అయితే రాజ్యసభకు నోటిఫికేషన్ రావడంతో ఆ పుకార్లు మరిన్ని ఎక్కువయ్యాయ్. అయితే జగన్-చిరు మధ్య మంచి సన్నిహిత సంబంధం ఉండటం.. మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ రియాక్ట్ కాకపోవడంతో ఇది అక్షరాలా నిజమని అందరూ భావించారు. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవితో పాటు కమెడియన్ అలీ పేరు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఈ పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టాలని భావించిన మెగా బ్రదర్ నాగబాబు ఓ వీడియో రూపంలో క్లారిటీ ఇచ్చేశారు.
ప్లీజ్.. కన్ఫూజ్ చేయకండి!
‘చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తున్నారన్న వార్తల్లో నిజం లేదు. అన్నయ్యకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. కళారంగానికే జీవితం అకింతం చేయాలని నిర్ణయించుకున్నారు. తప్పుడు వార్తలతో మెగా అభిమానులు, జనసైనికుల్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయకండి. ఒక రాజకీయ పార్టీ అన్నయ్య చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వబోతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. చిరంజీవి రాజకీయాలు వద్దనుకున్నారు. ఆయన కావాలనుకుంటే దేశంలో ఏ పార్టీ అయినా ఘనస్వాగతం పలికి రాజ్యసభ సీటు ఇస్తుంది. రాజ్యసభ సీటు కోసం వెళ్లాల్సిన అవసరం అన్నయ్యకు లేదు.. అనేది నా అభిప్రాయం. ఒకవేళ ఆయనకు అలాంటి ఆలోచనే ఉండి ఉంటే ఇలా అనుకుంటున్నాను తమ్ముడు అని ఓపినియన్ నాతో చెప్తారు. రాజకీయాల్లో ఆయన చూడని ఎత్తులు లేవు.. పల్లాలు లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానమైన సెంట్రల్ మినిస్టర్ పదవి అలంకరించారు’ అని నాగబాబు క్లారిటీ ఇచ్చేశారు.
అయితే.. మెగా బ్రదర్ క్లారిటీ ఇవ్వడంతో మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు, ఔత్సాహికుల్లో నెలకొన్న ఆందోళనకు తెరపడినట్లయ్యింది. మరి నిజంగానే చిరు మనసులోని మాటను నాగబాబు బయటపెట్టారా..? లేకుంటే హడావుడి జరుగుతోంది గనుక అలా ఓ రాయేస్తే పోలా అని ఆయన మాట్లాడారా..? అనేది తెలియాలంటే మరో రెండు మూడ్రోజుల్లో క్లారిటీ రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments